KCR- National Party: ఓ వైపు పీకే రొద.. మరోవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల ఆశ.. ఈ రెండింటి మధ్య అడ్డంగా బీజేపీ.. ఎలాగైనా సరే తెలంగాణలో లాగే దేశాన్ని దున్నేయాలని కలలుగంటున్న కేసీఆర్ కు ప్రధాన అడ్డంకిగా కమలదళం ఉంది. అందుకే బీజేపీ యేతర థర్డ్ ఫ్రంట్ ఏర్పాటా? లేక కొత్త జాతీయ పార్టీ పెట్టాలా? అన్న దానిపై సీఎం కేసీఆర్ తర్జన భర్జనలు పడుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రతినిధుల సభా వేదిక నుంచే కేసీఆర్ ఈ సంచలన ప్రకటన చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అది ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి ఇప్పుడు రాజకీయవర్గాల్లో సాగుతోంది.
కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ చేశారు. బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర థర్డ్ ఫ్రంట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కని ఫైట్ లేదు.. తొక్కని ప్రాంతీయ పార్టీల నేతల గడప లేదు. అలా దేశం మొత్తం తిరిగి సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు సంచలన ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతోంది.
Also Read: KTR – Adipurush: బీజేపీకి మైలేజ్ తెచ్చేందుకే ప్రభాస్ ‘ఆదిపురుష్’.. కేటీఆర్ సంచలన నిజాలు
ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలిసి కేసీఆర్ మద్దతు కోరారు. హెచ్.ఐసీసీలో బుధవారం నిర్వహించనున్న ప్రతినిధుల సభా తీర్మానాల్లో దీన్ని 11వ అంశంగా చేర్చారు. దీంతో ఖచ్చితంగా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన ప్రకారం.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ విలీనం సాధ్యమయ్యే పని కాదు. ఈ క్రమంలోనే పీకేతోనూ కేసీఆర్ విడిపోక తప్పదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని లీడ్ చేద్దామని భావిస్తున్నాడు. దీంతో కాంగ్రెస్ తో పొసగని కేసీఆర్ ఆ దిశగా ఆలోచించే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్మాయంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టే దిశగా కేసీఆర్ అడుగులు పడుతాయని అంటున్నారు. చాలా కాలంగా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు.. నాన్చివేతకు తాజాగా తెరదించబోతున్నట్టు తెలుస్తోంది.
అయితే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతారా? లేదా థర్డ్ ఫ్రంట్ దిశగా ప్రకటిస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ బలం దృష్ట్యా ఈ రెండింటిలో ఏదో ఒకటి డిసైడ్ అవుతాడని అంటున్నారు. ఇప్పటికే చాలా హిందీ రాష్ట్రాల్లో ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ టీఆర్ఎస్ అభిమానులు ఫ్లెక్సీలు, హోర్డింగులతో హోరెత్తించారు. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల రాక కన్ ఫం అయినట్టుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావ సభతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రకటన చేస్తారని అంటున్నారు.
Also Read:Revanth Reddy- Drugs Case: డ్రగ్స్ కేసును వదలని రేవంత్.. చిక్కుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు
Recommended Videos