https://oktelugu.com/

వరాలపై ఉత్కంఠ: నేడే తెలంగాణ కేబినెట్

తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటిపై ప్రజలు, ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు.. ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై కేబినెట్ భేటిలో ప్రధానంగా చర్చించనున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఇంటర్ సెకండియర్ ఫలితాలు, కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ […]

Written By: , Updated On : June 8, 2021 / 08:36 AM IST
Follow us on

తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటిపై ప్రజలు, ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు.. ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై కేబినెట్ భేటిలో ప్రధానంగా చర్చించనున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఇంటర్ సెకండియర్ ఫలితాలు, కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి.

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేబినెట్ భేటి జరుగనుంది. ఈనెల 9తో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగిస్తుందా? లేక ఎత్తివేస్తుందా? అన్న దానిపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం.. పాజిటివిటీ రేటు 2 శాతానికి పడిపోవడంతో ప్రభుత్వం అన్ లాక్ వైపే మొగ్గు చూపవచ్చు. అదే సమయంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే పూర్తి అన్ లాక్ చేయకపోవచ్చు.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. లాక్ డౌన్ సడలింపులను మరింత పెంచుతూ రాత్రిపూట కర్ఫ్యూని మాత్రం అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సడలింపులు సాయంత్రం 5 గంటల వరకు పెంచే అవకాశం ఉంది.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల పాస్ మార్కులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారిని ఇప్పటికే పాస్ చేశారు. ఇప్పుడురెండో సంవత్సరానికి కూడా మార్కులు ఇచ్చి పాస్ చేయాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

ఇక ఉద్యోగులంతా గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న పీఆర్సీపై కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.కరోనా సెకండ్ వేవ్ తో ప్రభుత్వం పీఆర్సీని వాయిదా వేసింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పీఆర్సీపై అమలుపై ప్రకటనకు సిద్ధమైంది. పెరిగిన జీతాలను జులై నుంచి అమలు చేసే అవకాశం ఉంది.