https://oktelugu.com/

KCR Jobs Announced : బిగ్ బ్రేకింగ్: అసెంబ్లీలో 91142 ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్

KCR Jobs Announced : తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. నిరుద్యోగుల ఆకలి తీర్చేలా దాదాపు లక్షకు చేరువగా ఉద్యోగాలను ప్రకటించారు. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దాదాపు లక్ష ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా స్థానికులకే ఏ జిల్లాకు ఆ జిల్లా వారకే పోస్టులు ఎక్కువగా ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు 39వేల పోస్టులు జిల్లాలకే కేటాయించారు. ఆ జిల్లా వాసులే ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2022 6:06 pm
    KCR Jobs Announced

    Telangana CM KCR

    Follow us on

    KCR Jobs Announced : తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. నిరుద్యోగుల ఆకలి తీర్చేలా దాదాపు లక్షకు చేరువగా ఉద్యోగాలను ప్రకటించారు. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దాదాపు లక్ష ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    KCR Jobs Announced

    KCR

    కాగా స్థానికులకే ఏ జిల్లాకు ఆ జిల్లా వారకే పోస్టులు ఎక్కువగా ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు 39వేల పోస్టులు జిల్లాలకే కేటాయించారు. ఆ జిల్లా వాసులే ఈ పోస్టులకు అర్హులు. ఆ తర్వాత జోనల్, మల్టీ జోనల్ పోస్టులను కేసీఆర్ ప్రకటించారు. పెద్ద జిల్లాలైన కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాల్లో వెయ్యికి పైగానే జిల్లా పోస్టులు పెట్టారు. చిన్న జిల్లాలైన వనపర్తి, రాజన్న సిరిసిల్లకు 500కుపైగా పోస్టులు ప్రకటించారు.

    Also Read: New Cricket Rules Announced By MCC: ఇకపై క్రీజు దాటితే ఔట్ లేదు.. క్రికెట్ లో కొత్త రూల్స్

    ఈ పోస్టులన్నింటికి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో రేపే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా కేసీఆర్ భర్తీ చేశారు. దాదాపు 11103 కాంట్రాక్ట్ ఉద్యోగాలను కేసీఆర్ క్రమబద్దీకరిస్తున్నట్టు ప్రకటించారు.

    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91142 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని.. వాటిలో 80039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు వెల్లడించారు. మిగిలిన 11103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్టు తెలిపారు.

    ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 95 శాతం స్థానిక కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని తెలిపారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకూ 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. 5శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

    -ఉద్యోగ ఖాళీల వివరణ
    హోంశాఖలో అత్యధికంగా 18344 పోస్టులు,
    విద్యాశాఖ లో 13086 ఉద్యోగాలు, వైద్య ఆరోగ్యశాఖలో 12755, ఉన్నత విద్యాశాఖలో 7878, బీసీ సంక్షేమ శాఖలో 4311 పోస్టులను భర్తీ చేయనున్నారు.

    Also Read: KCR VS Opposition Party’s: ఉద్యోగాల ప్రకటనపై ప్రతిపక్షాల గోల

    -తెలంగాణలో ఖాళీలు.. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులో కింది పీడీఎఫ్ ఫైల్ లో చూడొచ్చు..

    FINAL CM SIR’S STATEMENT

     

    CM KCR Makes Sensational Announcement In Assembly || CM KCR On Job Notifications || Ok Telugu