
రాష్ట్రానికి కేంద్రం సపోర్టు ఎంత గానో అవసరం. నిధులు కావాలన్నా.. ఏ పనులు కావాలన్నా కేంద్రంతోనే పని. మరి అలాంటి కేంద్రంతో ఏ రాష్ట్రమైనా దోస్తీగానే ఉంటుంది. కేంద్రాన్ని నిలదీయాలన్నా.. కేంద్రంపై విమర్శల అస్త్రం సంధించాలన్నా అంతో ఇంతో ధైర్యం కావాలి. కానీ.. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు. కేంద్రానిది పనికిమాలిన సర్కార్ అంటూ ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.
Also Read: ‘పరువు’ హత్యలకు పోయి సాధించిందేంటి..?
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. దీంతో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిన్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా వలసలూ నడుస్తున్నాయి. అందులోభాగంగా తెలంగాణ సర్కార్‌ను అస్థిరపరచడానికి కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కేసీఆర్ అనుమానిస్తున్నారు. అందుకే లొంగిపోయి ప్రభుత్వాన్ని బీజేపీకి దాసోహం కావడం కంటే… పోరాడి నిలుపుకోవడమే బెటర్ అనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
పార్టీ పరిస్థితిపై సీఎం కేసీఆర్ నిన్న మీటింగ్ పెట్టారు. ప్రగతిభవన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘంగా మీట్ అయ్యారు. మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పీపీ నేత కె.కేశవరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్న సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలే చేశారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణ బిల్లులకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని ఢిల్లీ నుంచి పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చారని, అలాగే చాలా మంది ప్రముఖులతో చెప్పించారన్నారు. అయినా రైతులు నష్టపోతారని ఆ రెండు బిల్లులకు మద్దతు ఇచ్చేం దుకు అస్సలు ఒప్పుకోలేదని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్లులకు కేసీఆర్ మద్దతు పలకకపోవడం బీజేపీకి కోపం తెప్పించినట్టుంది. అందువల్లే తమ ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆయన ఆవేదన చెందుతున్నట్లు కనిపిస్తోంది.
అంతేకాదు.. తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని కేంద్రం చూస్తోందని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ కుట్రలు ఫలించాయని, రాజస్థాన్‌లో చెల్లలేదని.. మహారాష్ట్రలోనూ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రాలను అదుపులో పెట్టుకోవాలని కేంద్ర సర్కారు చూస్తోందని.. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టిన కేసీఆర్, వారికి లొంగుతాడా..? అని ప్రశ్నించారు.
Also Read: రాముడి కోసం, దేశం కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా?
కేంద్రంలో బక్వాస్ సర్కార్ ఉందని.. అక్కడి పెద్దలు చెబుతున్నవి 99 శాతం అబద్ధాలేనని తీవ్రంగా విమర్శించారు కేసీఆర్. ఇంకా చెప్పుకోలేని విధంగా ఒత్తిళ్లు వస్తున్నట్లు కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌తో ఢీకొనడానికి కేసీఆర్ సర్కార్ సై అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ తీసుకున్న ఈ స్టాండ్ దేశ ప్రయోజనాల దృష్ట్యా శుభ పరిణామంగా చెప్పు కోవచ్చు. ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఉవ్విల్లూరుతున్న కేసీఆర్‌కు.. ఈ పరిణామాలు తొవ్వను చూపినట్లవుతున్నాయి. ఇక.. దేశ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అయినట్లే అనిపిస్తోంది
Comments are closed.