https://oktelugu.com/

KCR About Hijab: హిజాబ్ వివాదంపై కేసీఆర్ వ్యాఖ్యలు సరైందేనా?

KCR About Hijab:  కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్ ’ వివాదంపై కేసీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పార్టీ అయిన పీఎఫ్ఐ ప్రోత్సాహంతో కర్ణాటకలో విద్యార్థులు ‘హిజాబ్’ ధరించి వెళ్లారు. దీన్ని కర్ణాటక ప్రభుత్వం ఆదిలోనే ఆంక్షలు విధించింది. కర్ణాటకలో కావాలని కొన్ని ముస్లిం మతవాద సంస్థలు చేసిన ఈ కుట్రను హైకోర్టు కూడా గుర్తించి అడ్డు చెప్పింది. అయితే దీన్ని ప్రభుత్వానికి అన్వయించి కేసీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2022 / 10:36 PM IST
    Follow us on

    KCR About Hijab:  కర్ణాటకలో మొదలైన ‘హిజాబ్ ’ వివాదంపై కేసీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతి పార్టీ అయిన పీఎఫ్ఐ ప్రోత్సాహంతో కర్ణాటకలో విద్యార్థులు ‘హిజాబ్’ ధరించి వెళ్లారు. దీన్ని కర్ణాటక ప్రభుత్వం ఆదిలోనే ఆంక్షలు విధించింది.

    కర్ణాటకలో కావాలని కొన్ని ముస్లిం మతవాద సంస్థలు చేసిన ఈ కుట్రను హైకోర్టు కూడా గుర్తించి అడ్డు చెప్పింది. అయితే దీన్ని ప్రభుత్వానికి అన్వయించి కేసీఆర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

    Also Read: CM Jagan: ఒంటరిపోరు మళ్లీ కలిసి వస్తుందా?

    హిజాబ్ వల్ల కర్ణాటకలో పెట్టుబడులు ఆగిపోయాయని.. బెంగళూరు వెనుకబడిందని కేసీఆర్ ఆరోపించారు.కానీ ఇలాంటి మూఢమత విశ్వాసాలను ఆక్షేపించాల్సింది పోయి కేసీఆర్ దాన్ని బీజేపీ ప్రభుత్వానికి అంటకట్టడం.. రాజకీయంగా వాడుకోవడం పెద్ద దుమారం రేపింది.

    హిజాబ్ వివాదాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. ప్రభుత్వం హిజాబ్ ను నిషేధించలేదు. విద్యార్తి లోకంలో మతం, కులం,ఇలాంటి మత ఆచారాలు దృష్టి పెట్టకుండా స్వేచ్ఛగా ఉండాలని బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇదే కరెక్ట్ అన్న వాదన వినిపిస్తోంది.

    Also Read: CM KCR: ఒక్క జీవోతో వందల ఎకరాలకు వెసులుబాటు ఇచ్చినట్లేనా?

    రాజకీయాల్లోనూ హిజాబ్ ను ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ వాడుకోవడం సరైంది కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఆధునికతకు ముందుకుపోతుంటే ఇంకా సంప్రదాయం ముసుగులో విద్యార్థులను మత మౌఢ్యంలోకి పంపడం కరెక్ట్ కాదని.. హిజాబ్ ను నిషేధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ‘హిజాబ్ వివాదంపై కేసీఆర్ వ్యాఖ్యానం సరైనదేనా?’ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.