https://oktelugu.com/

సంక్షేమ పథకాల్లో భారీ మార్పుల దిశగా కేసీఆర్‌‌

జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతుండడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హడావుడి కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలకు సైతం మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దూకుడును మొదలుపెట్టేశాయి. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ కూడా కసరత్తు ప్రారంభించారు. అందుకే.. ఏపీ పథకాలపై ఆరా తీస్తున్నారు. ఏపీలో జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాల మాదిరే ఇక్కడ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. Also Read: పవన్‌ షో వెనుక అసలు కథ ఇదేనా..? […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2020 / 02:00 PM IST
    Follow us on


    జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతుండడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హడావుడి కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలకు సైతం మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే దూకుడును మొదలుపెట్టేశాయి. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ కూడా కసరత్తు ప్రారంభించారు. అందుకే.. ఏపీ పథకాలపై ఆరా తీస్తున్నారు. ఏపీలో జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాల మాదిరే ఇక్కడ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం.

    Also Read: పవన్‌ షో వెనుక అసలు కథ ఇదేనా..?

    2014లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. హామీలన్నింటినీ దాదాపుగా నెరవేర్చి.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్‌‌. ఎన్నికల హామీలను అటకెక్కించి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, అమరావతి చుట్టూ పరిభ్రమించి 2019లో ఘోర వైఫల్యం చెందారు చంద్రబాబు. గతంలో చంద్రబాబుతో పోల్చి చూస్తే కేసీఆర్ పాలన బాగుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు జగన్ పాలనతో పోల్చి చూస్తే తెలంగాణ ప్రజలు అసంతృప్తిలో ఉన్నారనేది వాస్తవం.

    అందుకే.. అటు దుబ్బాకలో, ఇటు జీహెచ్‌ఎంసీలో ప్రభుత్వ వ్యతిరేక తీర్పునిచ్చారు ఓటర్లు. ప్రజా సంక్షేమ పథకాల్లో ఎక్కడో తేడా కొడుతోందనే విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్‌‌.. పరోక్షంగా ఏపీతో వస్తున్న పోలికపై కూడా దృష్టి పెట్టారు. ఏపీలో ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో ఇంకా ఆర్టీసీ నష్టాలతోనే కునారిల్లుతోంది. అంతేకాదు.. తెలంగాణలో వీఆర్వోలను ఏకపక్షంగా తొలగించారు. ఏపీలో వీఆర్వోల అవినీతికి సచివాలయాలతో చెక్ పెట్టారు జగన్.

    Also Read: బ్రేకింగ్: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

    మరోవైపు.. జగన్‌ అధికారంలోకి రాకముందే తన మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన నవరత్నాలు సూపర్‌‌ హిట్‌ సాధించాయి. ఇటీవల మొదలైన ఇళ్ల పంపిణీ.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఏం జరుగుతోందనే విషయంపై ఆరా తీస్తున్నారు కేసీఆర్. ఏపీతో పోల్చి చూస్తే ఆర్థికంగా తెలంగాణ మెరుగైన స్థితిలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంతో తెలంగాణతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ సజావుగా జరిగే పరిస్థితి. అలాంటి రాజధాని లేకుండా, రాజధానితో వచ్చే లాభాలు లేకుండానే ఏపీలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు భారీగా ఖర్చు పెడుతోంది. ప్రధానంగా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ వంటివి మాత్రం తెలంగాణలో అందుబాటులో లేవు. దీంతో నవరత్నాలలో వేటిని తీసుకోవాలనే విషయంపై కేసీఆర్ ఆదేశాలతో అధికారులు దృష్టి సారించారు. మొత్తంగా చూస్తే.. మొన్నటి చేదు ఫలితాలు మరోసారి ఎదురుకాకుండా కేసీఆర్‌‌ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్