MLC Kavitha Husband Anil Kumar: ఢిల్లీ లిక్కర్ లో ఎప్పటికప్పుడు ట్విస్టులు చోటుచేసుకుంటు న్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ కీ రోల్ పోషించినట్టు ఈడీ అనుమానిస్తున్నది. దీంతో స్కాం భాగస్వాముల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నాయి. స్కాంలో భాగంగా గతేడాది కవిత ఇంట్లో ఏర్పాటు చేసిన మీటింగ్ పిళ్లయ్. అభిషేక్, శరత్ చంద్ర తదితరులతో పాటు కవిత భర్తపై అనిల్ కుమార్ సైతం.. పాల్గొన్నట్లు ఈడీ తన మొదటి చార్జిషీట్ లో ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ చర్చల్లో భాగస్వామ్యం అయినట్లు పేర్కొంది. దీంతో కొన్ని రోజులుగా కవిత భర్త కనిపించకుండా పోయాడు. కవిత అరెస్టుపై ప్రచారం ఒప్పందకున్న నేపథ్యంలో కూడా ఆయన ఎక్కడ కనిపించడం లేదు. శుక్రవారం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దీక్ష చేసిన సమయంలోను అనిల్ కుమార్ కనిపించలేదు. శనివారం కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమె తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయినా కవిత భర్త వీడి ఆఫీస్ వరకు రాకపోవడం చర్చనీయాంశమైంది.
లిక్కర్ స్కాంలో అనిల్ పాత్ర?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూపు రోల్ చాలా కీలకమని స్పెషల్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో పలు సందర్భాల్లో ఈడీ ప్రస్తావించింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో సహా ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఈ గ్రూపును నడి పించారని ఆరోపించింది. ఇప్పటికే మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి అరెస్టు కాగా.. తదుపరి దర్యాప్తులో ఎవరు ఉంటారనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అనిల్ కు నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం.
అమెరికాలో అనిల్..
లిక్కర్ స్కామ్ లో కవిత భర్తను కూడా ఈడి విచారించనున్నట్లు తెలియడంతో కెసిఆర్ అండ్ కో హుటాహుటిన అతడిని అమెరికా పంపినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉంటే అతడిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంటుందన్న భావనతో ఆయనను దేశం విడిచి వెళ్లాలని సూచించారని సమాచారం. కవిత స్థానిక ఎమ్మెల్సీ కావడం, విదేశాలకు వెళితే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో ఆమెను ఇక్కడే ఉంచారని తెలుస్తోంది. అనిల్ మాత్రం స్థానికంగా అందుబాటులో ఉండకుండా చేశారని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన నెల రోజులుగా తెలంగాణలో కనిపించడం లేదని సమాచారం.
నోటీసులు ఇవ్వాలని భావించిన దర్యాప్తు సంస్థలు..
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సౌత్ గ్రూప్ తరపున కవిత ఇంట్లో జరిగిన చర్చల్లో ఆమె భర్త అనిల్ కుమార్ పాల్గొన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని భావించాయి. ఈ సమాచారం లీక్ కావడంతో కెసిఆర్, కవిత, కేటీఆర్ కలిసి అనిల్ కుమార్ ను ఇక్కడి నుంచి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.
దక్షిణాది వ్యాపారులపై దృష్టి..
దక్షిణాది రాష్ట్రాల నుంచి డబ్బుండి.. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఆసక్తి ఉన్నవారిపై సమీర్ మహేంద్రు ఆసక్తి చూపారు. అందులో భాగంగా అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ద్వారా ఆరా తీశారు. ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇష్ట పడేవారి గురించి వివరాలను తెలు సుకునే సమయంలో కవిత పేరును పిళ్లయ్ ప్రస్తావించారు. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్ లో 2021 సెప్టెంబరులో డిన్నర్ మీటింగ్ జరిగిన తర్వాత వీళ్లయ్ ద్వారా కవితతో సమీర్ మహేంద్రు మాట్లాడారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్స్ ద్వారా భాగస్వామ్యం లభించిందుకు ఆయనకు ఆమె కృతజ్ఞతలు తెలిపినట్టు.. సమీర్ మహేంద్రు గతేడాది నవంబరు 12న ఇచ్చిన స్టేట్మెంట్ ను ఈడీ తన చార్జిషీట్లో ప్రస్తావించింది. ఆ చర్చలకు కొనసాగింపుగా గతేడాది మొదట్లో హైదరాబాద్ వచ్చిన సమీర్ మహేంద్రు.. కవితతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు. అందులో కవితతో పాటు ఆమె భర్త అనిల్, పిళ్లయ్, బోయినపల్లి అభిషేక్, శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆ రోజు చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఈ స్కామ్లో ఏ మేరకు అనిల్ భాగస్వామ్యం ఉన్నది? తదితర వివరాలను రాబట్టాలని ఈడీ భావించింది. ఇది గమనించిన కల్వకుంట్ల ఫ్యామిలీ అనిల్ కుమార్ ను తప్పించినట్లు తెలుస్తోంది.
కవిత కంటే ముందు అనిల్ పైనే ఫోకస్..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కంటే ముందు ఆమె భర్త అనిల్ కుమార్ ని ప్రశ్నించాలని ఈడీ భావించింది. ఈ మేరకు నోటీసులు కూడా రెడీ చేసింది. ఇంతలోనే అనిల్ కుమార్ దేశం నుంచి తుర్రుమనడంతో తర్వాత కవితపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kavithas husband anil kumar has been missing for a few days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com