https://oktelugu.com/

కవిత ఎన్నిక.. బస్తీమే సవాల్ అంటున్న అన్నదమ్ములు..!

ఒక ఎన్నిక ఇద్దరి అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతోంది. వైరిపక్షాలుగా ఉన్న అన్నదమ్ములు నువ్వా.. నేనా అని పోటీపడుతున్నారు. అయితే వీరిద్దరు పోటీపడేదీ మాత్రం వారి ఎన్నిక కోసం కాదట. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను గెలిపించేందుకు ఒకరు ప్రయత్నిస్తుండగా మరికొకరు కవితను ఎలాగైనా ఓడించాలని యత్నిస్తున్నారు. దీంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా రాజ్యసభ్య సభ్యులు డి.శ్రీనివాస్ కుటుంబానికి నిజామాబాద్లో మంచి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 19, 2020 / 04:00 PM IST
    Follow us on


    ఒక ఎన్నిక ఇద్దరి అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతోంది. వైరిపక్షాలుగా ఉన్న అన్నదమ్ములు నువ్వా.. నేనా అని పోటీపడుతున్నారు. అయితే వీరిద్దరు పోటీపడేదీ మాత్రం వారి ఎన్నిక కోసం కాదట. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవితను గెలిపించేందుకు ఒకరు ప్రయత్నిస్తుండగా మరికొకరు కవితను ఎలాగైనా ఓడించాలని యత్నిస్తున్నారు. దీంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది.

    తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా

    రాజ్యసభ్య సభ్యులు డి.శ్రీనివాస్ కుటుంబానికి నిజామాబాద్లో మంచి పట్టుంది. డి.శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు అర్వింద్, సంజయ్. వీరిలో అర్వింద్ కిందటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీచేసి అనుహ్యంగా గెలుపొందారు. ఇక సంజయ్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గతంలో నిజామాబాద్ మాజీ మేయర్ గా పని చేశారు. కిందటి లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా కవిత గెలుపు నల్లేరుపై నడక అనుకున్న తరుణంలో బీజేపీ నుంచి పోటీచేసిన అర్వింద్ గెలుపొంది టీఆర్ఎస్ కు భారీ షాకిచ్చారు.

    తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ కూతురు కవిత పోటీ చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నప్పటికీ గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరుగకుండా జాగ్రత్త పడుతోన్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి ధర్మపురి సంజయ్ రంగంలోకి దిగి కవిత గెలుపునకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్లాన్ చేస్తున్నాడు.

    డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తారా?

    లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓటమికి ఇతరులతో కలిసి అర్వింద్ పనిచేశాడు. ఇప్పుడు కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ అప్రమత్తంగా ఉంది. అందుకే ఎంపీ అరవింద్ కు చెక్ పెట్టేందుకు అతడి సోదరుడు సంజయ్ ను రంగంలోకి దింపింది. ఈమేరకు సంజయ్ బీజేపీ నుంచి పది కార్పొరేట్లను టీఆర్ఎస్ లోకి రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకున్న పాతపరిచయాలతో బీజేపీ కార్పోరేటర్ల భారీ తాయిలాలు ఇస్తుండటంతో ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు కారెక్కినట్లు తెలుస్తోంది. మిగతా వారిని కూడా గులాబీ పార్టీలోకి రప్పించేందుకు సంజయ్ చక్రం తిప్పుతున్నాడని సమాచారం.

    కిందటి లోక్ సభ ఎన్నికల్లో కవితకు భారీ షాకిచ్చిన ఎంపీ అర్వింద్ మరోసారి నిజామాబాద్లో తన సత్తాచాటాలని భావిస్తున్నాడు. బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ గాలం వేస్తుండటాన్ని గమనించిన అర్వింద్ ఈమేరకు వారితో సమావేశమై భరోసా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో బీజేపీ నుంచి కారెక్కేందుకు యత్నించిన కార్పోరేటర్లు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారని సమాచారం.

    అర్వింద్ జిల్లాలో రోజురోజుకు బలం పెంచుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. కవిత ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతూ బస్తీమే సవాల్ అంటున్నారు. దీంతో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.