https://oktelugu.com/

మెగాఫోన్‌ పట్టేందుకు రెడీ అవుతున్న హీరోయిన్‌!

‘అలా మొదలైంది’తో తెలుగు తెరకు పరిచమయైన హీరోయిన్‌ నిత్యా మీనన్. కళ్లతోనే అద్భుతంగా నటించే అతి కొద్ది మంది నాయికల్లో ఒకరు. చాలా టాలెంటెడ్‌ నటి ఆమె. ఏ పాత్రలో నటించినా తనదైన ముద్ర వేస్తుందామె. అందుకే తక్కువ సినిమాలే చేసినా మంచి పేరు తెచ్చుకుంది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే హీరోయిన్లకు ఆమె పూర్తి డిఫరెంట్. ఆఫర్లు వస్తున్నాయి కదా అని అన్ని సినిమాలూ ఒప్పుకోదామె. కథతో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలు అంగీకరిస్తుంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 19, 2020 / 03:43 PM IST
    Follow us on


    ‘అలా మొదలైంది’తో తెలుగు తెరకు పరిచమయైన హీరోయిన్‌ నిత్యా మీనన్. కళ్లతోనే అద్భుతంగా నటించే అతి కొద్ది మంది నాయికల్లో ఒకరు. చాలా టాలెంటెడ్‌ నటి ఆమె. ఏ పాత్రలో నటించినా తనదైన ముద్ర వేస్తుందామె. అందుకే తక్కువ సినిమాలే చేసినా మంచి పేరు తెచ్చుకుంది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకునే హీరోయిన్లకు ఆమె పూర్తి డిఫరెంట్. ఆఫర్లు వస్తున్నాయి కదా అని అన్ని సినిమాలూ ఒప్పుకోదామె. కథతో పాటు తన పాత్ర నచ్చితేనే సినిమాలు అంగీకరిస్తుంది. దక్షిణాది అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌కు వెళ్లినా.. ఆమె చేసిన చిత్రాలు తక్కువే. గతకొంతకాలంగా ప్రయోగాత్మక పాత్రలపై దృష్టిసారిస్తోన్న ఆమె దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో చక్కటి అవకాశాల్ని అందుకుంటోంది.

    జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో మిక్స్డ్ టాక్..!

    ఇప్పుడు ఆమె మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. తన సొంత కథతోనే ఆమె డైరెక్టర్ గా మారాలని చూస్తోందట. నటనతో పాటు ఆమెకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. షూటింగుల్లో తన సీన్స్ లేనప్పుడు.. కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును ఆమె పరిశీలిస్తూ ఉంటుంది. ఆ అభిరుచితోనే దర్శకురాలు కావాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు లాక్‌డౌన్‌ బ్రేక్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. షూటింగ్స్ ఆగిపోవడంతో వచ్చిన బ్రేక్‌లో నిత్యా పలు కథలు రాస్తోందట. వివిధ భాషల్లో తను కమిట్ అయిన చిత్రాలను వచ్చే ఏడాదిలోగా పూర్తిచేసేసి రెండేళ్లలో మెగా ఫోన్ పట్టుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ మధ్యే ఆమె డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది. ‘బ్రీత్‌ ఇన్‌ టూ దీ షాడోస్‌’ అనే హిందీ వెబ్‌సిరీస్‌లో నటించింది. జూలై 10న రిలీజ్ కానున్న ఈ సిరీస్‌లో అభిషేక్‌బచ్చన్‌, సయామీఖేర్‌ ఇతర కీలక పాత్రల్ని పోషించారు.