కేటీఆర్ కు కవిత కౌంటర్.. వైరల్..

పరిస్థితులు ఎలా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హస్యాన్ని ఒలికించడంలో కింగ్ అని ప్రతీఒక్కరికి తెల్సిందే. హస్యమే ముఖ్యమంత్రి బలమని అందరు చెబుతుంటారు ఆయన సన్నిహితులు. ఇక ఆయన వారసత్వం పునికిపుచ్చుకున్న కేటీఆర్, కవిత కూడా ఆయన శైలిలో హస్యంతోనే ప్రత్యర్థులపై పంచ్ లు విసురుతుంటారు. వీరి ధాటికి ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతుంటారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే కేటీఆర్ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా ట్వీటర్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు తన […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 1:05 pm
Follow us on


పరిస్థితులు ఎలా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హస్యాన్ని ఒలికించడంలో కింగ్ అని ప్రతీఒక్కరికి తెల్సిందే. హస్యమే ముఖ్యమంత్రి బలమని అందరు చెబుతుంటారు ఆయన సన్నిహితులు. ఇక ఆయన వారసత్వం పునికిపుచ్చుకున్న కేటీఆర్, కవిత కూడా ఆయన శైలిలో హస్యంతోనే ప్రత్యర్థులపై పంచ్ లు విసురుతుంటారు. వీరి ధాటికి ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతుంటారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే కేటీఆర్ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటారు. తాజాగా ట్వీటర్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు తన చెల్లెలు మాజీ ఎంపీ కవిత ఓ సరదా సవాల్ విసిరారు. ఈ సవాల్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

లాక్డౌన్ నేపథ్యంలో కటింగ్, షేవింగ్ చేయించుకోవడం ఇబ్బందిగా మారిందని ఏప్రిల్ 20 తర్వాత సెలూన్లు తెరిచే అవకాశాలు ఉన్నాయా అంటూ ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించాడు. లేనట్లయితే తన భార్య కత్తెరకు పని చెబుతుందని లాక్డౌన్ ఎత్తేశాక కూడా తాను ఇంటికే పరిమితం కావాలంటూ హస్యాన్ని జోడించాడు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్యకు హెయిల్ స్టైల్ చేసేందుకు అవకాశం ఇచ్చాడు.. నువ్వేందుకు ఇవ్వకూడదూ? అంటూ సమాధానమిచ్చాడు.

ఈ ట్వీట్ కు కేటీఆర్ చెల్లెలు కవిత బదులిస్తూ.. ‘అన్నయ్యా.. బాబీకి కూడా ఆ ఛాన్స్ ఇస్తున్నావా?’ అని అడిగారు. ఈ సంభాషణ ఆసక్తికరంగా మారడంతో ఓ అభిమాని ‘వదిన గారూ అన్నగారికి హెయిర్ కటింగ్ చేస్తే చూడటానికి ఎంత మంది రెడీగా ఉన్నారు బ్రదర్’ అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. అయితే చెల్లెలు విసిరిన సవాల్ పై కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..