https://oktelugu.com/

Kashmir Elections 2022: కాశ్మీర్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?

Kashmir Elections 2022: ఈ సంవత్సరం చివరిలోపల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు , కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కశ్మీర్ ను విభజించాక ఇదే తొలి ఎన్నికలు. నవంబర్ లోపేల జమ్మూకాశ్మీర్ లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగున్నాయి. కాశ్మీర్ ఎన్నికలు ఎలా జరుగబోతున్నాయి? కాశ్మీర్ లో బీజేపీ సంస్కరణలు పనిచేస్తాయా? బీజేపీ గెలుపు సాధ్యమేనా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. Also Read: IT Minister KTR To Visit US: 10 […]

Written By:
  • NARESH
  • , Updated On : March 18, 2022 / 09:45 PM IST
    Follow us on

    Kashmir Elections 2022: ఈ సంవత్సరం చివరిలోపల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తోపాటు , కాశ్మీర్లో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కశ్మీర్ ను విభజించాక ఇదే తొలి ఎన్నికలు. నవంబర్ లోపేల జమ్మూకాశ్మీర్ లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగున్నాయి.

    Kashmir Elections 2022

    కాశ్మీర్ ఎన్నికలు ఎలా జరుగబోతున్నాయి? కాశ్మీర్ లో బీజేపీ సంస్కరణలు పనిచేస్తాయా? బీజేపీ గెలుపు సాధ్యమేనా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: IT Minister KTR To Visit US: 10 రోజుల పాటు కనిపించకుండా పోతున్న కేటీఆర్.. ఆ టూర్ కథేంటి?

    జమ్మూ కాశ్మీర్ లో సామాజిక సమీకరణాలు చూస్తే.. కాశ్మీరీలు, డొగ్రాలు (హిందువులు),గుజ్జర్ లు ఉంటారు. సామాజికంగా వీరే కాశ్మీర్ లో కీలకంగా ఉన్నారు. గుజ్జర్ లకు ఆదివాసీ గుర్తింపులు ఇచ్చారు. హిందువుల్లో దళితులు కూడా కీలకంగా ఉన్నారు.

    మత పరంగా చూస్తే ముస్లింలు మొత్తం రాష్ట్రంలో 69 శాతం, హిందువులు 29 శాతం, సిక్కులు 2 శాతం ఉన్నారు. కాశ్మీర్ లో అయితే 97 శాతం ముస్లింలు ఉన్నారు. జమ్మూలో 66శాతం హిందువులు, 30 శాతం ముస్లింలు , 4 శాతం సిక్కులు ఉన్నారు.

    Also Read: Devotional: పూజకు పువ్వులు ఎందుకు వినియోగిస్తారో తెలుసా?

    ముస్లిం ఆధిపత్యం ఉన్న కాశ్మీర్ లో మరి అభివృద్ధితో ముందుకెళుతున్న బీజేపీ గెలుస్తుందా? ఆ గెలపు సాధ్యపడుతుందా? బీజేపీని ముస్లింలు గెలిపిస్తారా? అన్నది కీలకంగా మారింది.