https://oktelugu.com/

Karnataka Assembly Elections 2023: కన్నడ ప్రజల నాడి ఇదీ.. ఈసారి ఆ పార్టీకే పట్టం

Karnataka Assembly Elections 2023: మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? కర్ణాటక ఓటర్ నాడీ ఎటువైపు మొగ్గుతోంది? బిజెపి మళ్లీ విజయం సాధిస్తుందా? కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కాపాడుకుంటుందా? లేకుంటే కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారా? ఇందుకు సంబంధించి సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి? అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించనుందా? అంటే.. ఔననే అంటోంది ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే. ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో […]

Written By:
  • Rocky
  • , Updated On : April 3, 2023 / 12:36 PM IST
    Follow us on

    Karnataka Assembly Elections 2023

    Karnataka Assembly Elections 2023: మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? కర్ణాటక ఓటర్ నాడీ ఎటువైపు మొగ్గుతోంది? బిజెపి మళ్లీ విజయం సాధిస్తుందా? కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కాపాడుకుంటుందా? లేకుంటే కుమారస్వామి కింగ్ మేకర్ అవుతారా? ఇందుకు సంబంధించి సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి? అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయదుందుభి మోగించనుందా? అంటే.. ఔననే అంటోంది ఏబీపీ-సీ ఓటర్‌ సర్వే. ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించిన ఈ సంస్థ తాజాగా ఫలితాలను వెల్లడించింది.

    ఈ సర్వే ప్రకారం..

    కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ 115-127 స్థానాలతో అధికారం కైవసం చేసుకోనుంది. అదేసమయంలో అధికార బీజేపీ 68-80 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితం కానుంది. ఇక, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ 23-35 స్థానాల్లోనే గెలవనుంది. 31 స్థానాలు ఉన్న హైదరాబాద్‌-కర్ణాటకలో కాంగ్రెస్‌ 19-23 స్థానాల్లోనూ, బీజేపీ 8-12 స్థానాల్లో విజయం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. 50 స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ 25-29 స్థానాల్లోనూ, బీజేపీ 21-25 స్థానాల్లోనూ గెలిచే పరిస్థితి ఉందని తేల్చి చెప్పింది. 21 స్థానాలున్న కోస్తా ప్రాంతంలోనూ కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరా హోరీ పోరు సాగనుందని సర్వే పేర్కొంది. ఇక్కడ బీజేపీ 9-13 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 8-12 స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంది.

    బీజేపీకి కంచుకోటగా పేర్కొనే 35 స్థానాలున్న సెంట్రల్‌ కర్ణాటకలోనూ కాంగ్రెస్‌-బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదని సర్వే పేర్కొంది. ఈ ప్రాంతంలో బీజేపీ 12-16 స్థానాలు, కాంగ్రెస్‌ 18-22 స్థానాల్లోనూ, జేడీఎస్‌ 2 స్థానాలకు పైబడి విజయం సాధించే అవకాశం ఉంది. పాత మైసూర్‌ ప్రాంతంలోనూ ప్రజలు జేడీఎస్‌తో పాటు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వే స్పష్టం చేసింది. మొత్తం 55 స్థానాలున్న పాత మైసూరులో జేడీఎస్‌ 26-27 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 24-28 స్థానాల్లోను, బీజేపీ కేవలం 1-5 స్థానాల్లోనూ గెలిచే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్‌ బెంగళూరులో కాంగ్రెస్‌ పార్టీ లీడ్‌లో ఉన్నట్టు సర్వే పేర్కొంది. బీజేపీకి 11-15 సీట్లు, కాంగ్రెస్ కు 15-19 స్థానాలు దక్కే అవకాశం ఉంది.

    ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యే కావాలి!

    అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన పోలరైజేషన్‌ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని ఏబీపీ-సీ ఓటరు సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 24.6ు మంది ఇదే అభిప్రాయం వెల్లడించారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సర్వేలో పాల్గొన్న మెజారిటీ ప్రజలు(39.1ు) మాజీ సీఎం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపారు. ఇదిలావుంటే, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై 50ు మంది పెదవి విరిచారు. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరును 47 మంది వ్యతిరేకిస్తున్నారు.

    Karnataka Assembly Elections 2023

    రాష్ట్రంలో పాలకపక్షం బీజేపీ, విపక్షాలు కాంగ్రెస్‌, జేడీఎస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే అవి ప్రచారంలోకి దూకాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ ఏడాది ఇప్పటికే పలుసార్లు రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రంలో ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న మాజీసీఎం బీఎస్‌ యడ్యూరప్ప అంతా తానై చుట్టేస్తున్నారు. సీఎం బసవరాజ్‌ బొమ్మై కూడా జిల్లాల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 2నెలల ముందే ప్రచారం మొ దలుపెట్టారు. ఇప్పటికే 129 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించారు. జేడీఎస్‌నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సైతం ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సొంతంగా కల్యాణరాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌పీపీ)అనే పార్టీ పెట్టి విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎం బరిలోకి దిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ పోటీచేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. 224మంది సభ్యు ల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌ కు75 మంది, జేడీఎస్ కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.