Karnataka Assembly Election Results: కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వేస్తోంది. రెండకెల సీట్లు దాటే అవకాశం కనిపించడం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తుంది. దీంతో అధికారం చేజారకుండా బీజేపీ ప్లాన్ బి అమలుకు అడుగులు వేస్తోంది.
జేడీఎస్ తో చర్చలు..
ప్లాన్ బి అమలులో భాగంగా బీజేపీ నేతలు కొందరు జేడీఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కలిసి పనిచేద్దామని, అధికారాన్ని పంచుకుందామని ఆఫర్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్లకు జేడీఎస్ నేతలు ఆకర్షితులవుతారా? అయితే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
క్యాంపునకు జేడీఎస్ ఎమ్మెల్యేలు?
ఇదిలా ఉంటే జేడీఎస్ గెలిచే సీట్లు కూడా 20 లోపే ఉండే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ సరళి ఇదే విషయం స్పష్టం చేస్తుంది. దీంతో.. జేడీఎస్ గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే క్యాంప్ కు తరలించే ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఫలితం రాగానే సంబరాలు చేసుకోకుండా.. క్యాప్ కు వెళ్లాలని ఆ పార్టీ అధినేత కుమారస్వామి ఆదేశించినట్లు సమాచారం. సింగపూర్ నుంచే కుమారస్వామి క్యాంప్ ఆపరేషన్.. మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.