https://oktelugu.com/

కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయా.. సోషల్ మీడియాలో రైతు ఆవేదన..!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయాయని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకం వరి తెలంగాణ సోనా పంట వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన ఆ రైతు అధికార పార్టీ కార్యకర్తే కావడం కొసమెరుపు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డి సోషల్ మీడియా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 25, 2020 / 12:08 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ మాటలు నమ్మి నష్టపోయాయని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. సన్నరకం వరి తెలంగాణ సోనా పంట వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలు వచ్చాయని తెలిపారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన ఆ రైతు అధికార పార్టీ కార్యకర్తే కావడం కొసమెరుపు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తన మనస్సులో ఉన్న బాధను వెళ్లగక్కుతున్నానని.. పార్టీపరంగా తను మాట్లాడటం లేదని తెలిపారు.

    Also Read: కేసీఆర్ బడ్జెట్‌ భారం తగ్గించుకుంటున్నారు

    సన్న వరి పంటను మూడున్నర ఎకరాల్లో సాగు చేశానని దోమపోటు అగ్గితెగులు, కాటుకరోగం వల్ల తాను పెట్టిన 50 వేల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వరి పంట ద్వారా ఒక్క రూపాయి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని.. సన్నరకం వరి సాగు వల్ల తాను పూర్తిగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను డొడ్డు వరి సాగు చేసేవాడినని తెలిపారు.

    దొడ్డు వరిని సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఇంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉండదని.. వరి సాగు వల్ల తనకు అప్పులు పెరిగిపోయాయని చెప్పారు. పంట నష్టం వల్ల తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని రైతు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పంటల వల్ల నష్టపోతే నష్టపరిహారం పంపిణీ చేశాయని కేసీఆర్ కూడా పంట నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని కోరారు.

    Also Read: కరోనా, వర్షాలు.. చార్జీల మోతలు.. సొంతూళ్లకు వెళ్లని జనం

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్ కేసీఆర్ నియంత్రిత సాగుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గంభీరావుపేట మండలంలో దేవరాజు అనే రైతు నిన్న వరిపంటకు నిప్పంటించారు. విషయం తెలిసిన బండి సంజయ్ రైతుతో ఫోన్ లో మాట్లాడి భరోసా ఇచ్చారు.