పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన 25 నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ప్రతీకారంగా అర్థరాత్రి సమయంలో దేశం నిద్రపోతున్న సమయంలో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. పహల్గాంలో చనిపోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలిగించింది. అయితే దీనికి పాక్ మళ్లీ భారత్‌పై దాడులకు పాల్పడింది. దేశ సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై దాడి చేసింది. మిసైల్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో పాక్ దేశంపై విరుచుకుపడింది. దీంతో భారతదేశ త్రివిధ దళాలు కూడా రంగంలోకి వచ్చాయి. దీంతో భారత్ అరేబియా సముద్రంలో ఉన్న పాక్ ఆయువుపట్టు అయిన కరాచీ పోర్టుపై INS విక్రాంత్‌తో దాడి చేసింది. ఈ పోర్టుపై పదులు సంఖ్యలో దాడులు చేసినట్లు సమాచారం. దీంతో పోర్టు మొత్తం కూడా నాశనం అయినట్లు తెలుస్తోంది. పాక్ ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంది. అయితే ఈ పోర్టు పాక్‌కు ఆయువుపట్టు వంటిది. ఇలాంటి కరాచీ పోర్టును ధ్వంసం చేయడంతో పాక్ నాశనం అయినట్లే. పాక్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
కరాచీ పోర్టు పాకిస్థాన్ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైనది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు నుంచి దాదాపుగా 70 శాతం ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. ఇలాంటి పోర్టును నాశనం చేయడంతో పాక్ సర్వ నాశనం అయిపోవడం ఖాయం అంటున్నారు. కరాచీ పోర్టు ఎగుమతులు, దిగుమతుల వల్ల ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో కరాచీ నగరం కూడా భారీగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో ప్రముఖ బ్యాంకులు, సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోర్టు నాశనం అయితే.. ఆర్థికంగా పాక్ పడిపోయినట్లే. కరాచీ నగరం నుంచే జీడీపీలో 20 శాతం పాక్‌కు వస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్లు ఇలా అన్ని విధాలుగా కూడా కరాచీ నగరం వల్ల పాక్‌క ప్లస్. ఇలాంటి కరాచీ పోర్టును భారత దేశ త్రివిధ దళాలు నాశనం చేశాయి. దీనివల్ల పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలు స్తంభిస్తాయి. ఇది పాక్ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఈ కరాచీ పోర్టు పూర్తిగా నేలమట్టం కావడంతో పాక్ పని ఇక అయిపోనట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో పాక్ ఫైటర్ జెట్లు దాడులకు పాల్పడ్డారు. వీటిని భారత సైన్యం తిప్పికొట్టింది. వెంటనే వాటిని పూర్తిగా నాశనం చేసి పాకిస్థాన్ ఫైటర్ జెట్‌ను సజీవంగానే అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం పాక్ ఫైటర్ జెట్ రాజస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.