Analysis On Kapu Political Leaders Meeting : కాపు రాజకీయ నాయకులు తరచూ సమావేశాలు జరపటమే కాకుండా మీడియాకు లీకులు ఇస్తూ అసలు ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. మరి దీన్నే ఆంధ్రా, తెలంగాణలో తేడా ఉంది. తెలంగాణలో ఎన్నికల యుద్ధం చాలా ఎక్కువగా ఉధృతంగా సాగుతుంది. కానీ తెలంగాణలో కులాల కుంపట్లు ఎక్కువగా ఉండవు. కానీ ఆంధ్రాలో కులాల కొట్లాటలు మొదలయ్యాయి.
ఆంధ్రా జనాభాలో మెజార్టీ ఉన్న కాపులను మచ్చిక చేసుకోవడానికి ఏపీలోని రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని కాపు నాయకుల విన్యాసాలు కూడా మనం చూస్తున్నాం. రాజమండ్రిలో ఏకంగా మంత్రులే కుల మీటింగ్ పెట్టుకోవడం సంచలనమైంది.
కాపు రాజకీయ నాయకులుగా అనుకునే అన్ని పార్టీల నేతలు మీటింగ్ ల మీద మీటింగులు పెడుతున్నారు. మీడియాకు లీకులు ఇస్తూ రచ్చ చేస్తున్నారు. కాపు నేతలు ఇలా మీటింగులు పెట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటీ.? ఇవన్నీ కాపు సామాజికవర్గానికి మేలు చేస్తాయా? కీడు చేస్తాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.