AP Politics: వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు. బానిస సంతతిగా చూసే గాడిద కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వసుదేవుడకు వచ్చింది. అనివార్యంగా మారింది. అయితే ఏపీలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి అదే సీన్ క్రియేట్ చేస్తోంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అండ్ కో, కమ్మ సామాజికవర్గం నేతలు.. ఎవరినైతే చులకనగా చూశారో …వాళ్ల పంచన చేరాల్సి వస్తోంది. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ దీనావస్థలో ఉంది. అధికార వైసీపీ చేతిలో టీడీపీ విలవిల్లాడిపోతోంది. కష్టం నుంచి పార్టీని గట్టెక్కించడం చంద్రబాబు వల్ల కావడం లేదు. బతుకు జీవుడా అని గడుపుతున్న టీడీపీ శ్రేణులు ఒక ఆశా కిరణం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వారికి దేవుడిలా కనిపించారు. గతంలో ఓ నాయకుడిగా కూడా ఒప్పుకోని వారంతా ఇప్పుడు పవన్ మహా నాయకుడిగా కీర్తించడం ప్రారంభించారు.. పవన్ లేనిదే పార్టీని నిలబెట్టుకోలేని స్థితిలోకి వచ్చిన చంద్రబాబు ఏకంగా ఎదురెళ్లి మరీ జనసేనానిని ఆత్మీయ అలింగనం చేసుకోవడం ప్రారంభించారు.

అయితే గతంలో టీడీపీ నాయకులు, శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కామెంట్స్ ను జన సైనికులు మరిచిపోలేకపోతున్నారు. అన్నను గెలిపించుకోలేని నీవు.. మమ్మల్ని గెలిపించానంటావా.. ఉట్టికెక్కలేనమ్మ.. స్వర్గానికి ఎక్కుతానందట అన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా కమ్మ నేతల కామెంట్స్ ను మరిచిపోలేకపోతున్నారు. అవసరం ఉంటే ఒకలా.. అవసరం లేకుంటే మరోలా వ్యవహరించడం ఆ సామాజికవర్గానికి అలవాటేనని చెబుతున్నారు. ఇప్పుడు అవసరం, అనివార్యంగా మారిన తరుణంలో హేళనగా మాట్లాడిన వారే ఇప్పుడు పవన్ చెంతకు చేరిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఆనందం వ్యక్తంచేస్తూనే.. గత అనుభవాల దృష్ట్యా కమ్మ సామాజికవర్గాన్ని నమ్మలేకపోతున్నారు.
వాస్తవానికి కాపు సామాజికవర్గం అంటే కమ్మల్లో ఒక రకమైన ధ్వేషం ఉంది. ఏనాడూ కాపుల పట్ల సహృదయం వారికి లేదు. అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు.. అవసరం తీరాక హేళనగా మాట్లాడుతుంటారు. కాపు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపిన సందర్భాలున్నాయి. పవన్ విషయంలో కూడా అదే మాటల దాడి చేశారు. 2014లో పవన్ మద్దతివ్వడం వాస్తవం, ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారం రావడం నిజం. అయితే ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా మేము అధికారంలోకి రావడానికి నీ కృషి ఏంటి అనే స్థితికి టీడీపీ నాయకులు వచ్చారు. ఇప్పుడదే టీడీపీ నాయకులు మీరు లేకుంటే బతకలేమన్న స్థితికి రావడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఏ నోటితో కాపులను ధ్వేషించారో.. ఇప్పుడు అదే కాపులు లేకపోతే జగన్ చేతిలో చస్తామన్న రేంజ్ కి టీడీపీ నాయకులు వచ్చారు. సాయం చేసి ఆదుకోండి అంటూ బేలచూపులతో ముందుకొస్తున్న చంద్రబాబు, అంట్ కో వైపు పవన్ ప్రస్తుతానికైతే జాలి చూపిస్తున్నారు.

అయితే జరుగుతున్న పరిణామాలు కాపులకు ఆనందపరుస్తున్నా… వెన్నుపోటు రాజకీయ సంస్కృతికి కమ్మ సామాజికవర్గం వారు అలవాటు పడిపోయారు. అధికారంలోకి వచ్చే వరకూ ఒకలా.. తీరా అధికారంలోకి వచ్చాక మరోలా కమ్మ నేతలు ఎప్పటికప్పుడు స్వరూపం మార్చుతుంటారు. ఇప్పుడు అవసరం, అనివార్యమైంది కనుక కాపులు గుర్తుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మళ్లీ తమలోనున్న ధ్వేషభావాన్ని బయటకు తీయ్యారన్న గ్యారెంటీ ఏమిటి? అన్న ప్రశ్న కూడా కాపుల నుంచి ఉత్పన్నమవుతోంది. అయితే గత అనుభవాలు, పరిణామాలు పరిగణలోకి తీసుకొని అచీతూచీ నిర్ణయాలు తీసుకోవాలని అటు కాపు సామాజికవర్గం అభిమానులు, జన సైనికులు కోరుతున్నారు.