https://oktelugu.com/

Kalvakuntla Kavitha: బీజేపీ ఆరోపణలపై ‘కవిత’ అస్త్రం.. రేపు మీడియా ముందుకు.. ఏదో జరుగబోతోంది?

Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ అవినీతిని వెలికితీయడానికి ‘కాళేశ్వరం’ వాడారు.. మంత్రి కేటీఆర్ కు హైదరాబాద్ పబ్ లో వాటాలను అంటగట్టారు. ఇప్పుడు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపిస్తున్నారు. ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దెదించేందుకు బీజేపీ ఎంచుకున్న ఏకైక సాధనం ‘అవినీతి’. గులాబీ దళంపై కమ్ముకుంటున్న ఈ అవినీతి మేఘాల్లో కల్వకుంట్ల కవిత బుక్కైంది. ఆ కారుచీకట్లను తరిమికొట్టేందుకు ఇప్పుడు వస్తోంది. బీజేపీ ఆరోపణలు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపాత్రపై వివరణ ఇవ్వబోతోంది. కేసీఆర్ కూతురు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2022 / 08:36 PM IST
    Follow us on

    Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ అవినీతిని వెలికితీయడానికి ‘కాళేశ్వరం’ వాడారు.. మంత్రి కేటీఆర్ కు హైదరాబాద్ పబ్ లో వాటాలను అంటగట్టారు. ఇప్పుడు కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపిస్తున్నారు. ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దెదించేందుకు బీజేపీ ఎంచుకున్న ఏకైక సాధనం ‘అవినీతి’. గులాబీ దళంపై కమ్ముకుంటున్న ఈ అవినీతి మేఘాల్లో కల్వకుంట్ల కవిత బుక్కైంది. ఆ కారుచీకట్లను తరిమికొట్టేందుకు ఇప్పుడు వస్తోంది. బీజేపీ ఆరోపణలు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపాత్రపై వివరణ ఇవ్వబోతోంది.

    కేసీఆర్ కూతురు అవినీతి చేశారంటూ బీజేపీ ఎలుగెత్తి చాటింది. కేంద్రంలో అధికారమున్న బీజేపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతిపైనే ఫోకస్ చేసింది.  అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెడుతోంది.. బీజేపీకి ఢిల్లీ లిక్కర్ స్కాం  ఆయాచితంగా దొరికేసింది.   బీజేపీ శ్రేణులు ఇప్పుడు టీఆర్ఎస్ అవినీతిపై ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.  ఇన్నాళ్లు గుట్టుగా సంసారం చేసిన టీఆర్ఎస్ పరువు  బజారున పడుతోంది. బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్ బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొంది.

    అందుకే బీజేపీ తో డైరెక్ట్ ఫైట్ కు రెడీ అవుతోంది కల్వకుంట్ల కవిత. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడానికి మీడియా ముందుకు వస్తున్నారు. బీజేపీ ఆరోపణలను తిప్పి కొట్టాడానికి.. తనపై ఆరోపణలు అవాస్తవాలని చెప్పడానికి కదిలి వస్తోంది.

    ఏబీఎన్ చానెల్ లో నేడు స్పెషల్ డిబేట్ కు కల్వకుంట్ల కవిత ఒప్పుకోవడం సంచలనమైంది. ఎందుకంటే అది టీఆర్ఎస్ చానెల్ కాదు.. పేపర్ అంతకంటే కాదు.. అలాగని బీజేపీ ఫేవర్ మీడియా కూడా కాదు.. నిజాలు నిక్కచ్చిగా బయటపెట్టే చానెల్ అది. అందుకే కవిత వ్యూహాత్మకంగా ఏబీఎన్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు.. కేసీఆర్, కేటీఆర్ లపై బీజేపీ శ్రేణుల విమర్శలన్నింటికి కవిత సమాధానం ఇచ్చేందుకు ఏబీఎన్ కు వస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని.. కవిత ఖచ్చితంగా బీజేపీని ఎదురుదెబ్బ కొట్టడానికి సమాయత్తమై వస్తోందని తెలుస్తోంది.

    బీజేపీ హిందుత్వ, హైదరాబాద్ మత కల్లోలాలపై ఏదో ఒక విషయం బయటపెట్టి కవిత సంచలనానికి తెరతీయబోతోందని టాక్ వినిపిస్తోంది. తనపై బీజేపీ చేసిన కుట్రలను బయటపెట్టబోతోందని అంటున్నారు. తమను టార్గెట్ చేసిన బీజేపీ తెలంగాణలో ఎండగట్టడమే ధ్యేయంగా ఈ స్పెషల్ డిబేట్ కు వస్తున్నట్టు తెలుస్తోంది. మరి కవిత ఏం మాట్లాడుతుంది? ఏ ఏ నిజాలు చెబుతుంది? బీజేపీని ఎలా ఎదుర్కొంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కూతురు వస్తుందనగా మీడియా ఫోకస్ అంతే అటే మరలింది. సో రేపు ఏదో జరుగబోతోంది? అందేంటన్నది ఏబీఎన్ లో చర్చను చూడాల్సిందే..