Homeజాతీయ వార్తలుKalvakuntla Kavitha కవిత ఈడీ విచారణలో ఉండగానే.. కల్వకుంట్ల కుటుంబంలో మరో అరెస్ట్

Kalvakuntla Kavitha కవిత ఈడీ విచారణలో ఉండగానే.. కల్వకుంట్ల కుటుంబంలో మరో అరెస్ట్

Kalvakuntla Kavitha : ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తలుపు తట్టినప్పటికీ ఆమెకు ఊరట లభించడం లేదు. ఆమెను ఎలాగైనా బయటికి తీసుకురావాలని కేటీఆర్ కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడే ఉన్నారు. వివిధ న్యాయ నిపుణులతో కేసీఆర్ ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇప్పటికే కవితను చూసేందుకు కేసిఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం వారు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇది ఇలా ఉండగానే ఎన్ ఫోర్స్ అధికారులు కవిత కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు.. అనిల్ బంధువుల ఇళ్లల్లో కూడా ఇదే తీరుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ హడావిడి కొనసాగుతుండగానే.. కల్వకుంట్ల కుటుంబంలో మరో అరెస్టు చోటుచేసుకుంది.

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కల్వకుంట్ల కన్నారావును తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నారావు పలు భూ వివాదాల్లో తల దూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి- ఆదిభట్ల పరిధిలో రెండు ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతంలో విలువైన ప్రభుత్వ భూములను ఆయన తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం వాటిపై విచారణ నిర్వహించింది. ఈ క్రమంలో కన్నారావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నది నిజమేనని తేలింది. దీంతో ప్రభుత్వం అతడిని అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు రంగంలోకి దిగగా కన్నారావు కొద్దిరోజుల నుంచి పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. శనివారం అతడి ఆచూకీ లభ్యమైంది. దీంతో పోలీసులు కన్నారావు అరెస్టు చేశారు.

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టు అయ్యారు. ఆమె బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. కపిల్ సిబాల్ లాంటి న్యాయవాదులు కేసును వాదించినప్పటికీ బెయిల్ అదే మార్గం కనిపించడం లేదు. ఈ వ్యవహారమే ఇలా ఉంటే.. కన్నారావు చేసిన భూభాగోతం వల్ల కల్వకుంట కుటుంబంలో మరో అరెస్టు చోటుచేసుకుంది. కన్నారావు విచారణ నిమిత్తం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఇప్పటికే కన్నారావుకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ పలు అభియోగాలు మోపింది. దానికి సంబంధించిన ఆధారాలను న్యాయమూర్తి ఎదుట ఉంచింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కన్నారావును పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular