https://oktelugu.com/

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

  ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. హత్యకు సంబంధించిన ఆయుధాల కోసం పులివెందుల తూర్పు ఆంజనేయస్వామి గుడిపక్కన వాగులో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే గోవాలో అరెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ ను పులివెందులకు తీసుకొచ్చిన అధికారులు.. అతడు ఇచ్చిన వివరాలతో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. రెండు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2021 / 04:08 PM IST
    Follow us on

     

    ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. హత్యకు సంబంధించిన ఆయుధాల కోసం పులివెందుల తూర్పు ఆంజనేయస్వామి గుడిపక్కన వాగులో సీబీఐ తనిఖీలు చేపట్టింది.

    ఇప్పటికే గోవాలో అరెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ ను పులివెందులకు తీసుకొచ్చిన అధికారులు.. అతడు ఇచ్చిన వివరాలతో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులోని నీటిని తోడేస్తున్నారు.

    పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ మధ్య సునీల్ ను సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చి సీబీఐ బృందాలు ఆయుధాల కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి.

    పులివెందులలోని రోటరీపురం వద్ద ఉన్న బ్రిడ్జి కింద ఉన్న డ్రైనేజీలోనూ మారణాయుధాల కోసం గాలింపు చేపట్టారు.

    వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ కుమార్ పాత్ర ఉందని సీబీఐ తేల్చింది. పులివెందుల నుంచి కుటుంబంతో సహా పారిపోయిన సునీల్ ను గోవాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. సునీల్ తోపాటు అతడి తమ్ముడు కిరణ్ యాదవ్, తల్లిదండ్రులను సీబీఐ ప్రశ్నించింది.

    గత 62 రోజులుగా ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అయితే సీబీఐ తనను వేధిస్తోందని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని సునీల్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.