KA Paul: ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాజకీయంగా దుమారమే రేగుతోంది. రెండు పార్టీల్లో నెలకొన్న గొడవలతో రాష్ర్ట ప్రతిష్ట మసకబారుతోంది. భౌతిక దాడులకు దిగడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. టీడీపీ, వైసీపీ తీరును ఎండగడుతున్నారు. ఇద్దరివి దారితప్పిన రాజకీయాలే అని దుయ్యబడుతున్నారు. నైతికతకు పెద్దపీట వేయకుండా అనైతికంగా ప్రవర్తించడంపై విమర్శలు చేస్తున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నాయని ఆరోపించారు. ఒకరిపై మరొకరు దాడులు తెగబడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు నశించాయి. పరస్పర దాడులకు దిగడం దారుణం. నేతల మధ్య సమన్వయం కొరవడుతోంది. శాంతి అసలు కనిపించడం లేదు. దీంతోనే గొడవలకు కేంద్రంగా నిలుస్తున్నాయి.
రాష్ర్టం ఓ పక్క అప్పుల్లో కూరుకుపోతోంది. ప్రజా సంక్షేమం దారి తప్పుతోంది. నిరుద్యోగం ప్రబలుతోంది. అన్ని సామాజిక వర్గాలు అతలాకుతలం అవుతున్నాయి. అభివృద్ధి మాట దేవుడరుగు ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. పలితంగా సమస్యల పరిష్కారం కావడం లేదు. రాష్ర్ట రాజకీయాలు తిరోగమనంలో నడుస్తున్నాయి.
మరోవైపు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. దీంతో అధికార పార్టీ తాను అనుకున్నది చేయడానికి వెనుకాడటం లేదు. అధికారం చేతిలో ఉందని అడ్డు వచ్చిన వారిని అడ్డం తప్పించుకునే క్రమంలో వైసీపీ నేతలు తమ పలుకుబడిని ఉపయోగిస్తూ నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.