KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. ప్రముఖ ప్రబోధకుడు కేఏ పాల్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో కూడా అర్థం కాదు. సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయానికి దిగిపోతుంటాడు. మిగతా టైంలో అమెరికాలో సేదతీరుతుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మూడ్ కావడంతో కేఏ పాల్ మళ్లీ దిగిపోయాడు. ఈసారి కేసీఆర్ పై పడ్డాడు.
రెండు రోజుల కిందట తెలంగాణ సీఎం నివాసం ప్రగతిభవన్ వద్ద హల్ చల్ చేసిన కేఏ పాల్ ఈరోజు కూడా కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. టీఎస్ హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదని, వారం రోజుల్లో కమిషన్ చైర్మన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేస్తున్న అవినీతిని అక్రమాలను కవర్ చేయడానికే మానవ హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయడం లేదన్నారు.
సదాశివపేట పోలీసులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేశారు. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కేఏ పాల్ కోరారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని ఆరోపించారు.
ఎవరినైన ఫినిష్ చేసేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని, నన్ను ఫినిష్ చేయలేవు కేసీఆర్.. నువ్వు ఫినిష్ అవుతున్నావు.. అని మండిపడ్డారు.
ఈ సందర్భంగా బీజేపీ రాజకీయాలను కేసీఆర్ పై వేశాడు కేఏ పాల్. కేసీఆర్ ను ఎదురిస్తున్న బండి సంజయ్ ను దించేసి తన స్నేహితుడైన కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవిలో కేసీఆర్ కూర్చుండబెట్టారని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.
మొత్తంగా వరుసగా కేసీఆర్ తో కయ్యానికి కాలుదువ్వుతూ సంచలన ఆరోపణలతో కేఏ పాల్ వార్తల్లో నిలుస్తున్నారు.