Tollywood : జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. నెక్స్ట్ ఎవరనే భయం కొందరు ప్రముఖులను వెంటాడుతుంది. డబ్బు, అవకాశాల ఆశజూపి పరిశ్రమలో అమ్మాయిలను లైంగికంగా వాడుకుంటున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దుబాయ్ ట్రిప్స్ పై ఒక కన్నేస్తే ఎవరి బాగోతం ఏమిటో తేలిపోతుందట. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా కాలంగా తన అసిస్టెంట్ పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని కేసు నమోదైంది. జానీ మాస్టర్ వద్ద పని చేసే 21 ఏళ్ల యువతి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తాను మైనర్ గా ఉన్నప్పటి నుండే జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేస్తున్నాడు. మతం మార్చుకుని, వివాహం చేసుకోవాలని ఇబ్బంది కూడా పెట్టాడని ఆ యువతి ఆరోపించింది. జానీ మాస్టర్ పై పోక్సో(POCSO) చట్టం క్రింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు.
జానీ మాస్టర్ ఉదంతం నేపథ్యంలో టాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం చర్చకు వచ్చింది. అనసూయ భరద్వాజ్ ఆ యువతికి మద్దతుగా నిలిచింది. ధైర్యంగా తన అభిప్రాయం తెలియజేసింది. సమంత సైతం పెదవి విప్పారు. కేరళ గవర్నమెంట్ మాదిరి తెలంగాణ ప్రభుత్వం సైతం ఓ కమిటీ ఏర్పాటు చేసి, టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న వేధింపులపై అధ్యయనం చేయాలని కోరింది. మహిళల రక్షణకు విధివిధానాలు రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు.
అన్ని చిత్ర పరిశ్రమలలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అందుకు టాలీవుడ్ అతీతం కాదు. డబ్బు, అవకాశాలు ఆశచూపి లొంగదీసుకునే నటులు, దర్శక, నిర్మాతలు, మేనేజర్స్, అసిస్టెంట్… అసోసియేట్ డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు. ముసుగు తొలిగే వరకు అందరూ పెద్ద మనుషులే. బడా బాబులు అందరు దుబాయ్ వేదికగా తమ లైంగిక వాంఛలు తీర్చుకుంటారనే వాదన ఉంది.
తమతో బెడ్ షేర్ చేసుకునేందుకు ఒప్పుకున్న అమ్మాయిలతో ఎంచక్కా దుబాయ్ చెక్కేస్తారు. ఇక్కడ నుండి విడివిడిగా వెళతారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో లేదా, ముందుగా బుక్ చేసుకున్న హోటల్ లో కలుసుకుంటారు. షాపింగ్ చేస్తారు. క్లబ్స్ లో పబ్స్ లో కలిసి ఎంజాయ్ చేస్తారు. ట్రిప్ పూర్తి కాగానే విడివిడిగా ఏమీ తెలియనట్లు ఇండియాకు చేరుకుంటారు. తరచుగా దుబాయ్ వెళ్లే ప్రముఖులపై నిఘా పెడితే వారి బాగోతం బయటకు వస్తుందని సమాచారం.
హైదరాబాద్ లో గల గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో గల లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా ఇందుకు వేదిక అవుతున్నాయని సమాచారం. పలు విధాలు అమ్మాయిలను లొంగదీసుకుని లైంగికంగా వాడుకుంటున్నారట. టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కాలంగా మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారి వెన్నులో వణుకు మొదలైంది..
Web Title: Tollywoods dark side is only in dubai trips
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com