Jio Helpline : ఎంత మంచి నెట్‌వర్క్ అయినాసరే ఎప్పుడో ఓ సారి సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు నెట్‌వర్క్ ఇబ్బంది పెడుతుంది.. మరికొన్నిసార్లు ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. చాలా మందికి కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్ తెలుసు.. కానీ ఇంకా చాలా మందికి ఫిర్యాదు చేయడానికి ఏ నంబర్‌కు కాల్ చేయాలో తెలియదు.
ఈరోజు ఇండియాలో టాప్ టెలికాం కంపెనీ హెల్ప లైన్ నంబర్ల గురించి తెలుసుకుందాం. జియో మొబైల్ మాత్రమే కాకుండా, జియో ఫైబర్, జియో ఎయిర్‌ఫైబర్ హెల్ప్‌లైన్ నంబర్ల గురించి కూడా తెలుసుకుందాం. రిలయన్స్ జియో కోట్ల మంది వినియోగదారులకు ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ గురించి సమాచారం ఇచ్చారు. మీరు కంపెనీ సిమ్‌ను ఉపయోగిస్తుంటే మీ జియో నంబర్ నుండి ఫిర్యాదు చేయడానికి మీరు 198కి కాల్ చేయాలి.
Also Read : తక్కువ ధరలో ఎక్కువ లాభాలు.. జియో రూ. 189 ప్లాన్ వివరాలివే
జియో ఫైబర్ హెల్ప్‌లైన్ నంబర్
జియో ఫైబర్ వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే కాల్ చేయాలని కంపెనీ తన అధికారిక సైట్‌లో స్పష్టం చేసింది. జియో ఫైబర్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే, మీరు మీ రిజిస్టర్డ్ నంబర్ నుండి 1800 896 9999కి కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
జియో ఎయిర్‌ఫైబర్ హెల్ప్‌లైన్ నంబర్
మీ ఇంట్లో రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మీరు 1800 896 9999కి కాల్ చేయాలి. ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయడానికి కూడా మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి మాత్రమే కాల్ చేయాలి.
పైన పేర్కొన్న అన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయడానికి కాల్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో చిక్కుకుంటే ఏ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలో ఇప్పుడు కచ్చితంగా తెలిసిపోయినట్లే.
Also Read : మళ్లీ పెరగనున్న రిచార్జ్ లు.. ఎయిర్ టెల్, జీయోల నిర్ణయం..