పండ్ల రైతుల పరిస్థితి భయానికం:జనసేన

పులివెందుల , తాడిపత్రి , శింగనమల ఈ మూడు నియోజకవర్గాలలో పండ్ల రైతుల కష్టాలకు జనసేన పార్టీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి అండగా నిలిచారు.కరోన నేపథ్యంలో రాష్ట్రమంతా లాక్ డౌన్ కావడంతో ఆ రైతులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ మూడు ప్రాంత రైతులు నిత్యం అరటి , మామిడి , చీని ( బత్తాయి ) కర్బూజ , కళింగర మొదలగు పంటలు పండిస్తారు .ప్రస్తుతం రైతుల చేతికి పంట అందుతోంది .సరిగ్గా ఈ […]

Written By: Neelambaram, Updated On : March 29, 2020 8:21 am
Follow us on


పులివెందుల , తాడిపత్రి , శింగనమల ఈ మూడు నియోజకవర్గాలలో పండ్ల రైతుల కష్టాలకు జనసేన పార్టీ వైస్ చైర్మన్ పసుపులేటి పద్మావతి అండగా నిలిచారు.కరోన నేపథ్యంలో రాష్ట్రమంతా లాక్ డౌన్ కావడంతో ఆ రైతులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.

ఈ మూడు ప్రాంత రైతులు నిత్యం అరటి , మామిడి , చీని ( బత్తాయి ) కర్బూజ , కళింగర మొదలగు పంటలు పండిస్తారు .ప్రస్తుతం రైతుల చేతికి పంట అందుతోంది .సరిగ్గా ఈ కరోనా వైరస్ వల్ల దేశం మొత్తం లాక్డౌన్ అవ్వడం తో ఇక్కడి రైతుల పరిస్థితి చాల భయానక స్థితిలో ఉంది . ఎవ్వరికైనా చెబుధామంటే వినేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . ముఖ్యంగా పులివెందుల నియొజకవర్గం లింగాల మండలం మరియు సరిహద్దు ప్రాంతంలోని అరటి రైతుల పరిస్తితి చాల తీవ్ర ఇబ్బంది పరిస్థితిలో ఉంది అరటి గెలలు చెట్టు మీదె మాగిపోతున్నాయి . శింగనమల నియొజకవర్గం ఎల్లనూరు , పుట్లూరు మండలాలలో చీని ( బత్తాయి ) , అరటి ,కర్బూజ , బుక్కరాయసముద్రం , నార్పల , శింగనమల మండలాలలో కర్బూజ ,కలింగర పంట రైతుల పరిస్థితి బయాందోళన లో ఉంది .తాడిపత్రి నియొజకవర్గం లోని తాడిపత్రి రూరల్ , పెద్ద పప్పూరు , పెద్ద వడగూరు మండలాల్లో మామిడి మరియు పండ్ల తోటల రైతుల పరిస్థితి అయోమయంలో ఉంది. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకి భరోసా కల్పించి న్యాయం చెయ్యాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు అనంతపురం జిల్లా కలెక్టరుకి మరియు వ్యవసాయశాఖ , మార్కెటింగ్ శాఖ అధికారులకి పులివెందుల వ్యవసాయశాఖ , మార్కెటింగ్ శాఖ అధికారులకి పద్మావతి వినతిపత్రం ద్వారా తెలియజేసారు.