Homeఆంధ్రప్రదేశ్‌Janasena: స్పీడ్ పెంచిన జనసేనాని.. పవన్ ప్రసంగాల్లో పెరిగిన వాడీవేడీ

Janasena: స్పీడ్ పెంచిన జనసేనాని.. పవన్ ప్రసంగాల్లో పెరిగిన వాడీవేడీ

Janasena: జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. పదునైన వాగ్భాణాలతో అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇప్పటివరకూ తాను చేసింది.. ఇక నుంచి చేయబోయే దాని గురించి విష్పష్గంగా చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి క్లారిటీ ఇస్తున్నారు. తాను ఎందుకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఓటు చిలనివ్వనని చెబుతున్నానో ప్రజలకు వివరిస్తున్నారు. బావోద్వేగ ప్రకటనలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. తాను చేపడుతున్న కౌలురైతు భరోసా యాత్రలో చేస్తున్న కీలక వ్యాఖ్యలు అధికార పక్షంలో గుబులు రేపుతున్నాయి. నంద్యాల మండలం శిరివెళ్లలో కౌలు రైతుభరోసా యాత్రలో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. అధికార పార్టీ నాయకులు మీరు సింగిల్‌గా రావాలి… సింగిల్‌గా రావాలి అని కోరుతున్నారని.. కానీ రావాలో లేదో నేను నిర్ణయించుకోవాలి..అది చెప్పడానికి మీరెవరయ్యా అంటూ విరుచుకుపడ్డారు. మా నేత సింహం.. ఎప్పుడూ సింగిల్ గా వస్తారని చెబుతున్నారని.. సింగిల్ గా వచ్చి ప్రజలను ఎలా చీల్చి చెండాడారో తెలుస్తోందని జగన్ ను ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. సింహాలు గెడ్డాలు గీసుకోవు.. నేను గీసుకుంటానని తాను సినిమాలో డైలాగులు చెప్పానని.. అటువంటివి సినిమాలు వరకూ బావుంటాయని కానీ బయటకాదని తేల్చిచెప్పారు. తనకు ప్రజల ఎజెండా తప్ప మరే జెండా, ఎజెండా తాను మోయనని స్పష్టం చేశారు.రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు. వ్యూహాలే ఉంటాయి. వైసీపీ నేతలు ఈ విషయం తెలుసుకోవాలని సూచించారు. నాకు పదవి కావాలని నేనెప్పుడూ వ్యూహం వేయను. మీ గుండెల్లో ఉన్న పదవి కంటే నాకు ఏ పదవీ ఎక్కువ కాదంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని, ఆలోచించి ప్రజలు అడుగు ముందుకు వేయాలని కోరారు.

Janasena
Pavan Kalyan

కుల రాజకీయాలపై ఫైర్

కుల రాజకీయాలపై పపన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు కొంచెం అతి ఎక్కువైందని.. దాన్ని తగ్గించుకోవాలన్నారు. పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తానని… కానీ, కులాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరికీ మనుగడ ఉండదన్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదన్నారు. కానీ, నన్ను వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు దూషిస్తున్నారని.. నేను కూడా వారి గురించి చాలా మాట్లాడగలనన్నారు. పాత చిట్టాలు బయటకు తీయగలనని.. కానీ దానివల్ల ప్రయోజనం ఏముందన్నారు. యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని జగన్ సర్కారు మోసం చేసిందన్నారు. జాబ్ కేలండర్ కు అతీగతీ లేదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు.. దాని గురించి మరిచిపోయారు.

Also Read: Ram Gopal Varma- Mother’s Day: నేను ఓ మంచి కొడుకును కాదంటున్న రాంగోపాల్ వర్మ

అలా ఎందుకు అన్నానంటే..

Janasena
Pavan

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే వైఖరిని ఎందుకు తీసుకున్నది పవన్‌ వివరించారు.వైసీపీ అస్తవ్యస్త పాలన నుంచి ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్నారు. రాష్ట్రంలో ఎవరినీ బతకనీయడం లేదన్నారు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకునే వైసీపీని తిరిగి అధికారంలోకి రానీయొద్దని కోరుకుంటున్నట్టు చెప్పారు. మళ్లీ వైసీపీ వస్తే ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు.. మా వెంట ఎవరెవరు కలిసి వస్తారో నాకు తెలియదన్నారు. కానీ, జనసేన బలంగా ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్తుంది అని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, పొత్తుల గురించి భవిష్యత్తులో మాట్లాడుకోవచ్చునన్నారు. అవసరమైతే బీజేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడతానన్నారు. అమరావతి రాజధాని కోసం కూడా ప్రశ్నిస్తానని చెప్పారు. నాపై కేసులు లేవు కాబట్టే స్వేచ్ఛగా మాట్లాడతానని పవన్ వ్యాఖ్యానించారు. తాను ప్రజల కోసమే అవమానాలు భరిస్తున్నానని.. వైసీపీ తన ఆర్థిక మూలలను దెబ్బతీసేవిధంగా ప్రయత్నిస్తోందని, మానసికంగా వేధిస్తోందని, అయినా ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్నీ భరిస్తున్నానన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల బిడ్డల చదువు, వారి కుటుంబాల్లోని వారికి పింఛన్లను అందించే బాధ్యతను తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మొత్తానికి పవన్ ప్రసంగాలు ప్రజలకు ఆకట్టుకునేలా సాగుతున్నాయి.

Also Read: Rashmika Mandana: రష్మిక పై ఆ సీన్స్ తీస్తారట.. రణబీర్ కూడా రెడీ !

Recommended Videos:

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

4 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular