https://oktelugu.com/

JanaSena VeeraMahila : వైసీపీ అరాచకాలపై జనసేన వీర మహిళల పోరాటం షురూ!

JanaSena VeeraMahila : ఎటు చూసినా ఆంధ్రా రాష్ట్రంలో అతివలకు భద్రత కరువైంది. ఏపీ నడిబొడ్డున మహిళపై సామూహిక అత్యాచారం.. రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్తను కొట్టి మరీ భార్యపై గ్యాంగ్ రేప్.. ఇక వారానికో రేప్.. 10 రోజులకో మర్డర్.. ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు కలకలం రేపుతున్నాయి. వరుస మర్డర్లు. గ్యాంగ్ రేప్ లతో మహిళల రక్షణ ఏపీలో కరువవుతోంది. ఎన్నడూ లేని విధంగా జరుగతోన్న సీరియల్ అత్యాచారాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. విజయవాడ, […]

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2022 / 08:03 PM IST
    Follow us on

    JanaSena VeeraMahila : ఎటు చూసినా ఆంధ్రా రాష్ట్రంలో అతివలకు భద్రత కరువైంది. ఏపీ నడిబొడ్డున మహిళపై సామూహిక అత్యాచారం.. రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్తను కొట్టి మరీ భార్యపై గ్యాంగ్ రేప్.. ఇక వారానికో రేప్.. 10 రోజులకో మర్డర్.. ఏపీలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు కలకలం రేపుతున్నాయి. వరుస మర్డర్లు. గ్యాంగ్ రేప్ లతో మహిళల రక్షణ ఏపీలో కరువవుతోంది. ఎన్నడూ లేని విధంగా జరుగతోన్న సీరియల్ అత్యాచారాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.

    Pavan Kalyan

    విజయవాడ, గుంటూరు గ్యాంగ్ రేపులు ఏపీలో పెను దుమారం రేపాయి. రేపల్లెలో మరో సామూహిక అత్యాచారం జరగడం ఆంధ్రాలో అలజడి రేపుతోంది. ఏకంగా రైల్వే స్టేషన్ లో గర్భిణీపై గ్యాంగ్ రేప్ జరగడంతో రేపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో ఏపీలో మరోసారి రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.

    వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే రోజుకో మహిళపై రేప్ అండ్ మర్డర్ జరుగుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఏపీ నడిబొడ్డున.. సీఎం ఇంటికి కూత వేటు దూరంలో కూడా కృష్ణ నదీ తీరంలో ఓ రేప్ అప్పట్లో జరిగింది. అయినా ఇప్పటివరకూ చర్యలు లేవు. నిందితులపై కఠిన శిక్షలు లేవు. అందుకే ఏపీలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలను చెరబడుతున్నారు. అదే ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా చేస్తోంది.

    దిశ చట్టం అంటూ.. మహిళా భద్రతకు పెద్ద పీట అంటున్నా కూడా ఏపీలో అత్యాచారాల పరంపర ఆగడం లేదు. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నా ఈ అత్యాచారాలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో వైసీపీ సర్కార్ అసమర్థతపై విమర్శల వర్షం కురుస్తోంది.

    Also Read: CM Jagan- Ali: కమెడియన్ అలీకి షాకిచ్చిన జగన్

    ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘జనసేన వీర మహిళ’ ట్విట్టర్ అకౌంట్ ను ప్రారంభించారు. ఈ సామాజిక మాధ్యమ ద్వారా వైసీపీ పాలనలో ఆడవారిపై అఘాయిత్యాలను ఎలుగెత్తి చాటడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ పాలనలో జరిగిన అఘాయిత్యాలను లెక్కలతో సహా బయటపెట్టారు. ‘వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో వారానికి 75 రేప్ కేసులు, 1,061 లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో రోజుకు 10కి పైగా రేప్‌లు, 152కి పైగా లైంగిక నేరాలు జ‌ర‌గుతున్న‌ాయని’ జనసేన వీర మహిళా విభాగం ఏపీలోని ఘోరాల లెక్క తేల్చింది. అతివలకు ఏపీలో భద్రత లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి.

    జాతీయ స్థాయిలో నేరాల గణాంకాలను వెల్లడించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) తాజా నివేదిక ప్రకారం చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో నేరాల సంఖ్య గత రెండు మూడేళ్లుగా పెరుగుతూనే ఉంది. అందులో మహిళ పట్ల జరిగే నేరాలు 2021లో 14శాతం పెరిగాయి. మొత్తం నేరాల సైతం 3శాతం పెరిగాయి. అన్ని రకాల నేరాలు కలిసి 2021లో మొత్తం 1,27,127 నమోదయ్యాయి. వీటిలో మహిళలపై అమానుష ఘటనలు 17,736గా తేలాయి. మొన్నటివరకూ ఏపీ డీజీపీగా చేసిన గౌతం సవాంగ్ స్వయంగా వెల్లడించిన గణాంకాలే ఇవీ..

    ఈ దారుణాలను అరికట్టేందుకు జనసేన వీరమహిళలు పోరుబాట పట్టారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంపై యుద్ధానికి దిగబోతున్నారు. ఈ మేరకు ‘జనసేన వీర మహిళల’ ట్విట్టర్ అకౌంట్ లో పోరూ షూరూ చేశారు. ఇదిప్పుడు సోషల్ మీడియాను కదిలిస్తోంది. అందరినీ కదిలి వచ్చేలా చేస్తోంది. ఈ యుద్ధంలో మీరూ పాలుపంచుకొని జనసేన వీరమహిళలతో కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆడవారిపై అరాచకాలను అరికట్టాలని కోరుతున్నారు. ఈ పిలుపునకు మంచి స్పందన వస్తోంది.

    Also Read: Chandrababu Badude Badudu Tours: జగన్ టార్గెట్ గా చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ టూర్లు..

    Recommended Videos