https://oktelugu.com/

‘Janasena’ alliances: పొత్తులపై ‘జనసేన’ క్లియర్ కట్.. సస్పెన్స్ కు తెరదించే అవకాశం?

‘Janasena’ alliances: పవన్ కళ్యాణ్.. సినిమాలపై ఆసక్తితో రాలేదు.. కానీ విజయం వరించింది. రాజకీయాలను మార్చేయాలని వచ్చారు కానీ ఇక్కడ విజయం దక్కలేదు. జయాపజయాలకు కృంగిపోకుండా ముందుకెళుతున్న ధైర్యం పవన్ కళ్యాణ్ ది. ఏపీ రాజకీయాల్లో తనది 25 ఏళ్ల ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు. ప్రజలు గెలిపించినా.. గెలిపించకపోయినా వారి సమస్యలపై పోరాడుతుంటాడు. ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికపై భవిష్యత్తు ఏపీ రాజకీయాలను మార్చే కీలక ప్రకటన చేయబోతున్నారని తెలిసింది. నవ్యాంధ్రలో జనసేన పార్టీకి ఉన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : March 14, 2022 / 10:02 AM IST
    Follow us on

    ‘Janasena’ alliances: పవన్ కళ్యాణ్.. సినిమాలపై ఆసక్తితో రాలేదు.. కానీ విజయం వరించింది. రాజకీయాలను మార్చేయాలని వచ్చారు కానీ ఇక్కడ విజయం దక్కలేదు. జయాపజయాలకు కృంగిపోకుండా ముందుకెళుతున్న ధైర్యం పవన్ కళ్యాణ్ ది. ఏపీ రాజకీయాల్లో తనది 25 ఏళ్ల ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు. ప్రజలు గెలిపించినా.. గెలిపించకపోయినా వారి సమస్యలపై పోరాడుతుంటాడు. ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికపై భవిష్యత్తు ఏపీ రాజకీయాలను మార్చే కీలక ప్రకటన చేయబోతున్నారని తెలిసింది.

    ‘Janasena’ alliances

    నవ్యాంధ్రలో జనసేన పార్టీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జనసేన గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు సాధించినప్పటికీ ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్, జన సైనికులను చూస్తేనే అధికార పార్టీ హడలిపోతూ ఉంటుంది. జనసేనాని ఒక్క పిలుపు ఇస్తే ఏపీ మొత్తం కదిలి వస్తుండటంతో అధికార పార్టీ వెన్నులో వణుకుపుడుతూ ఉంటుంది.

    పవన్ కల్యాణ్ ను నేరుగా ఎదుర్కొలేక వ్యక్తిగత దూషణలు, ఆర్థికంగా(సినిమాలను) దెబ్బతిసేలా ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేస్తోంది. అయితే వీటన్నింటిని పవన్ కల్యాణ్ లెక్క చేయకుండా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోని మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా కొన్ని చోట్ల సీట్లు సాధించగా ఏపీలో తన బలాన్ని స్పష్టంగా చాటుకుంది.

    Also Read: Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్ ను పవన్ కళ్యాణ్ నిర్ధేశించబోతున్నారా?

    గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ఆదరించడతో ఆపార్టీ మరింత ఉత్సాహంతో ముందుకు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి దాదాపు 25శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. జనసేనను ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండటంతో జనసేనాని సైతం పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన రోడ్ల శ్రమదాన ఉద్యమానికి ప్రజల నుంచి ఉవ్వెత్తున మద్దతు లభించింది. గతంలోనూ పవన్ కల్యాణ్ హుదుద్ తుఫాన్, ఉద్దారం కిడ్ని బాధితుల పట్ల అండగా నిలిచారు. పవన్ పోరాటాలతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనసేన బలమైన పార్టీగా అవతరించింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, అమరావతి రైతుల పాదయాత్ర, స్పెషల్ స్టేటస్ పోరాటానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలుపడంతో ప్రజలు జనసేన వైపు చూస్తున్నారు. ఇటీవలీ కాలంలో జనసేనలోకి భారీగా వలసలు చోటుచేసుకుంటున్నాయి. ఆవిర్భావ సభా సాక్షింగా చాలా మంది టీడీపీ, వైసీపీ నేతలూ జనసేనలోకి వస్తున్నారు.

    గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నారు. పలుమార్లు జనసేన-బీజేపీ బంధం బీటలు వారుతుందనే వార్తలు వచ్చినా వాటిని రెండు పార్టీ నేతలు కొట్టిపారేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుందనే సంకేతాలను ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీతో పవన్ కల్యాణ్ సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఆపార్టీతోనే జనసేనాని ముందుకెళ్లే అవకాశం ఉంది.

    Also Read: AP New Districts: ఏపీ కొత్త జిల్లాలకు షాక్.. ఇక ఇప్పట్లో తేలవు… హైకోర్టులో అభ్యంతరాలు

    మరోవైపు టీడీపీ నాయకులు జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఆరాటపడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్ తో పొత్తుకు సానుకూలంగా ఉన్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. జనసేన 9వ ఆవిర్భావం సందర్భంగా జనసేనాని పొత్తులపై సైతం క్లారిటీ ఇచ్చే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. జనసైనికుల అనుమానాలను ఈ వేదికగా ద్వారా పటాపంచాలు చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చే అవకాశం ఉండటంతో అందరి అటెన్షన్ ఈసభనే నెలకొంది.