Pawan Kalyan House Arrest: బిగ్ బ్రేకింగ్: జనసేనానిపై జగన్ సర్కార్ ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హౌస్ అరెస్ట్?

Pawan Kalyan House Arrest: విశాఖ నిర్బంధాన్ని మరువకముందే మరోసారి ఏపీలోని జగన్ సర్కార్ జనసేనానిని బంధించింది. ఉక్కుపాదం మోపింది. కంచెలు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది.. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసింది. కదలనీయకుండా నిర్బంధించింది. ఇదేదో పాకిస్తాన్ అన్నట్టు.. అప్ఘనిస్తాన్ లో ఉన్నట్టు ఇన్ని నియంత్రణలతో జగన్ సర్కార్ పవన్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో పర్యటిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. […]

Written By: NARESH, Updated On : June 30, 2023 4:55 pm
Follow us on

Pawan Kalyan House Arrest: విశాఖ నిర్బంధాన్ని మరువకముందే మరోసారి ఏపీలోని జగన్ సర్కార్ జనసేనానిని బంధించింది. ఉక్కుపాదం మోపింది. కంచెలు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది.. పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసింది. కదలనీయకుండా నిర్బంధించింది. ఇదేదో పాకిస్తాన్ అన్నట్టు.. అప్ఘనిస్తాన్ లో ఉన్నట్టు ఇన్ని నియంత్రణలతో జగన్ సర్కార్ పవన్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో పర్యటిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కంచెలు వేసి మరీ ప్రజలను కలుసుకోనివ్వలేదు. అనంతరం జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆయను అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు.

ఇప్పటికే విశాఖలోనూ ఇలానే ప్రజల్లోకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ను జగన్ సర్కార్ నిర్బంధించింది. ప్రజా సమస్యలు తెలుసుకోకుండా అడ్డగించింది. తాజాగా హైదరాబాద్ లోని పవన్ నివాసంపై కొందరు దుండగులు రెక్కీ నిర్వహించి ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టారు. ఇలాంటి సమయంలో పవన్ ఏపీ పర్యటన ఉద్రిక్తతకు దారితీస్తోంది.

పవన్ ప్రజల్లోకి వెళితే వారి సమస్యలు లేవనెత్తుతారని.. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే అక్కసుతోనే పవన్ ను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇన్ని నిర్బంధాలు, ఉక్కుపాదాలతో పవన్ జనంలోకి ఎలా వెళతారు? వారి సమస్యలు ఎలా తెలుసుకుంటారన్నది ప్రశ్న. ఏపీలో రాజకీయామే ఇలా ఆంక్షల మధ్యన సాగుతుంటే ఇక ప్రతిపక్ష నేతలకు రక్షణ ఎక్కడుంటుందన్న ప్రశ్న ఉదయిస్తోంది.