https://oktelugu.com/

Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!

Janasena Party Protest : ఉద్యమిస్తే సాధించనిది ఏదీ లేదు. అది ఏదైనా సరే.. తెలంగాణ ఉద్యమం పతాకస్తాయికి చేరి చివరకు ‘స్వరాష్ట్ర’ ఫలితాన్ని సాధించింది. పట్టుబట్టిన పంజాబ్ రైతుల పోరాటానికి.. దేశంలోనే బలమైన మోడీ వెనక్కి తగ్గి సాగు చట్టాలు రద్దు చేశారు. ‘పోరాడితే పోయేది ఏముంది? బానిస సంకెళ్లు తప్ప’.. అన్న ఫిలాసఫీని అక్షరాల ఒంటబట్టించుకున్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు తన ‘పవర్’ ఏంటో ఏపీ సర్కార్ కు చూపిస్తున్నాడు. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 1, 2022 / 04:37 PM IST
    Follow us on

    Janasena Party Protest : ఉద్యమిస్తే సాధించనిది ఏదీ లేదు. అది ఏదైనా సరే.. తెలంగాణ ఉద్యమం పతాకస్తాయికి చేరి చివరకు ‘స్వరాష్ట్ర’ ఫలితాన్ని సాధించింది. పట్టుబట్టిన పంజాబ్ రైతుల పోరాటానికి.. దేశంలోనే బలమైన మోడీ వెనక్కి తగ్గి సాగు చట్టాలు రద్దు చేశారు. ‘పోరాడితే పోయేది ఏముంది? బానిస సంకెళ్లు తప్ప’.. అన్న ఫిలాసఫీని అక్షరాల ఒంటబట్టించుకున్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు తన ‘పవర్’ ఏంటో ఏపీ సర్కార్ కు చూపిస్తున్నాడు. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వ మెడలు వంచేందుకు సిద్ధమయ్యారు.

    Janasena Party Protest

    ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. దానికి ఆదాయం పెంచుకునే మార్గాల కోసం అన్వేషిస్తోంది. అందుకే చెత్త నుంచి విద్యుత్ స్తంభాలకు కట్టే వైర్ల వరకూ అన్నింటిపై పన్ను వేస్తోంది. తాజాగా కరెంట్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. ప్రజలంతా ఈ పన్నుల భారంపై ఆగ్రహంగా ఉన్న వేళ జనసేన పార్టీ దీన్ని అందిపుచ్చుకుంది. ప్రజాగ్రహాన్ని అనుకూలంగా మార్చుకుంది.

    Also Read: Prince Mahesh Babu: ఆయన బడ్జెట్ దెబ్బకు భయపడుతున్న మహేష్ !

    జనసేన పార్టీ చాలా తక్కువ సార్లు మాత్రమే ప్రజా ఉద్యమాలు చేపట్టింది. కానీ వాటికి అదిరిపోయే స్పందన వచ్చింది. అప్పట్లో ఉద్దానం సమస్యపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ఫలించి అక్కడి సమస్య తీరింది. అనంతరం అమరావతి రైతుల కోసం స్వయంగా రోడ్డుపై కూర్చొని పవన్ నిరసన తెలుపడంతో అది పతాకస్థాయికి చేరి కోర్టుల్లో రైతులు విజయం సాధించారు. శ్రమదానం కోసం అనంతపురం, కోస్తా జిల్లాలకు వచ్చినప్పుడు ఆయన వెంట జనం, అభిమానులు కదలివచ్చారు. అందుకే ఇలాంటి ఉద్యమాలతోనే జనసేనకు కావాల్సినంత మైలేజ్ వస్తుంటుంది.

    తాజాగా పవన్ కరెంట్ చార్జీల పెంపుపై పోరుబాట పట్టారు. ట్వీట్లు చేయడమే కాదు..జనసేనను రంగంలోకి దింపారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై రాష్ట్రమంతా జనసైనికులు కదంతొక్కారు. విజయవాడలో పోరాటం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఈ ఉద్యమం చేసే సరికి ఈ సెగ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తగిలింది.

    ప్రజాగ్రహాన్ని సరైన సమయంలో గుర్తించి పోరాడడం వల్ల జనసేనకు ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చింది. ఇలాంటి ఇమేజ్ రావడం చాలా కష్టం. కానీ జనసేన మాత్రం ఇలా ప్రజా ఉద్యమాలను ఎప్పటికప్పుడు గొప్పగా నిర్మిస్తూ ప్రత్మామ్మాయ శక్తిగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటోంది.

    జనసేన క్షేత్రస్థాయి నుంచి బలంగా తయారవ్వాలంటే ఇలాంటి ఉద్యమాలు ఆ పార్టీకి చాలా అవసరం. ప్రభుత్వంపై ఏ రూపంలో పోరాడాలో క్యాడర్ కు చెబితే వారు ప్రజలకు చేరువై వారి సమస్యలు పరిష్కారమై పార్టీ బలోపేతం అవుతుంది. జనసేనను జనం ఓన్ చేసుకుంటారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసైనికులపై కేసులు పెడుతున్నారు. కానీ వైసీపీ సర్కార్ కు ఏమాత్రం భయపడకుండా జనసైనికులు నిబద్ధత చాటుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి ఉద్యమాల్లో స్వయంగా పాల్గొంటే ఇవి మరింత ఉధృతమవుతాయి. ప్రభుత్వంలో కదలిక వస్తుంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం అవుతుంది. ఆ దిశగా జనసేన ముందుకు సాగాలని ఆశిద్దాం.

    Also Read: Regional Ring Road: ఆర్ఆర్ఆర్ కు కేంద్రం సై: హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం