https://oktelugu.com/

Janasena office for sale : అరే..! ఏంట్రా ఇదీ.. అమ్మకానికి జనసేన ఆఫీస్.. ధర ఎంతో తెలుసా? 

Janasena office for sale : ‘అమ్మకానికి జనసేన ఆఫీస్’.. ఈ వార్త వినగానే జనసైనికులు హతాషులవుతారు. తమ పార్టీ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంట్రా అంటూ నోరెళ్లబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని ఎత్తేశాడా? పార్టీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడా? అని అంతా షాక్ అయ్యారు. కానీ కొందరు ప్రబుద్ధులు చేసిన పనికి ఇప్పుడు జనసేన ఆఫీస్ వార్తల్లో నిలిచింది. ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ‘జనసేన పార్టీ’. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీని విస్తరించే […]

Written By:
  • NARESH
  • , Updated On : May 9, 2022 / 06:38 PM IST
    Follow us on

    Janasena office for sale : ‘అమ్మకానికి జనసేన ఆఫీస్’.. ఈ వార్త వినగానే జనసైనికులు హతాషులవుతారు. తమ పార్టీ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంట్రా అంటూ నోరెళ్లబెడుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని ఎత్తేశాడా? పార్టీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడా? అని అంతా షాక్ అయ్యారు. కానీ కొందరు ప్రబుద్ధులు చేసిన పనికి ఇప్పుడు జనసేన ఆఫీస్ వార్తల్లో నిలిచింది.

    Janasena office for sale

    ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది ‘జనసేన పార్టీ’. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీని విస్తరించే క్రమంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టించిన ఆఫీస్ ఇదీ. మంగళగిరిలో పవన్ సొంత ఖర్చుతో కోట్లు ఖర్చు పెట్టి మెరుగులు దిద్దిన ఈ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కొందరు ప్రబుద్దులు అమ్మకానికి పెట్టారు.

    తాజాగా సెకండ్ హ్యాండ్ వస్తువులు, స్థలాలు, ఆస్తులు, వాహనాలు అమ్మే ‘ఓఎల్.ఎక్స్’ సంస్థ వెబ్ సైట్ లో జనసేన ఆఫీస్ ఫొటోలు పెట్టి కొందరు ప్రబుద్దులు అమ్మకానికి పెట్టారు. సుంకర మనోహర్ అనే ప్రబుద్దుడు జనసేన ఆఫీస్ ఫొటోలను ఓఎల్ఎక్స్ లో పెట్టాడు. ‘ఎర్రబలం, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్’ అడ్రస్ లో ఈ సంస్థ ఉందని తెలిపాడు. దీన్ని అమ్మకానికి పెట్టి ఏకంగా ‘రూ.100 కోట్ల ధరను నిర్ణయించడం విశేషం.

    Janasena office

    Also Read: TDP Looking For Alliances: పొత్తుల కోసం టీడీపీ ఆరాటంలో అర్థముందా?

    ఒకటి కాదు రెండు కాదు.. పవన్ కళ్యాణ్ కలల పార్టీ కార్యాలయాన్ని 100 కోట్లకు బేరం పెట్టిన ఈ ప్రబుద్దుడి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు ఎవరీ ‘సుంకర మనోహర్’ ఎవరు? ఇతడికి జనసేనతో ఏం సంబంధం? జనసేనలో సభ్యుడా? లేక ఎవరో ఆకతాయి చేసిన పనినా? అని అందరూ ఆరాతీస్తున్నాడు.

    కొందరైతే ఈ పోస్టును షేర్ చేసి మరీ ‘అరే ఎంట్రా ఇదీ?.. మా జనసేన కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంట్రా’ అని నిలదీస్తున్నారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై ఇప్పటికైనా జనసేన అధిష్టానం స్పందించాల్సి ఉంది. లేకుంటే రేపు పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా అమ్మకానికి ఓఎల్.ఎక్స్ లో పెట్టినా పెట్టొచ్చు. అంతదాకా రాకముందే జనసేన దీనిపై స్పందించి ఇలాంటి నకిలీ పోస్టులను అరికట్టాల్సి ఉంది.

    Also Read: Mahesh Babu Sarkaru Vaari Paata: ‘సర్కారు’ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్