Janasena: దూకుడును దూకుడుతోనే కవర్ చేయాలి.. ఏపీ రాజకీయాల్లో చెలరేగిపోతున్న వైసీపీ బ్యాచ్ కు అంతే తీవ్రతతో ప్రతిస్పందించాలి. మాటకు మాట.. తొడకొడితే తొడకొట్టాలి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా సాగాలి. బాహుబలికి భళ్లాలదేవలా.. పవన్ కళ్యాణ్ కు జగన్ ఇప్పుడు ఈ ఇద్దరి వైరాన్ని అంతే స్థాయిలో ఎలివేట్ చేయాలని జనసేన భావిస్తోంది. వైసీపీతో యుద్ధంలో ఇప్పుడు దూకుడు ఫార్ములానే జనసేన ప్రయోగిస్తోంది.
వైసీపీ మంత్రులు ఊ అంటే చాలు.. జనసేనపై.. జనసేనాని పవన్ పై విరుచుకుపడుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రాజకీయ పరమైన విమర్శలకు జనసైనికులు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు. విధానపరమైన, రాజకీయ పరమైన అంశాల్లోనే కాదు.. వ్యక్తిగత విషయాలు లేవనెత్తి ఇరుకునపెడుతున్నారు. ఇన్నాళ్లు ఈ విమర్శలను సహిస్తూ వచ్చిన జనసేనాని పవన్ ఇక గేర్ మార్చడానికి రెడీ అయిపోయారు. వైసీపీకి దీటుగా మీదపడిపోయేలా దూకుడు మంత్రాన్ని జంపించాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది.
Also Read: BJP Dr Parthasarathi: జగన్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తాం: పార్థసారథి సంచలన ప్రకటన
ఏపీలో పాత బూతు మంత్రులు అయిన కొడాలి నాని, అనిల్ కుమార్ సహా అందరూ పోయి కొత్త మంత్రులు వచ్చారు. వీళ్లు కూడా పవన్ వ్యక్తిగత జీవితంపైనే పడుతున్నారు. అసలు పని వదిలేసి జగన్ మెప్పు కోసం పవన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్ లు పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
ఈ క్రమంలోనే జనసేన కూడా స్టాండ్ మార్చేసింది. అంతే వ్యక్తిగతంగా.. మంత్రులను బట్టలిప్పి నడిబజారులో నిలిపేలా కౌంటర్లు ఇవ్వాలని డిసడై్ అయ్యింది. గుడివాడ, అంబటి పాత సంగతులన్నీ బయటకు తీసి మరీ జనసైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక పవన్ సైతం ‘దత్తపుత్రుడు ’ టాపిక్ లో జగన్ పై విరుచుకుపడ్డ తీరు చూశాక ఆయన కూడా ట్రాక్ చేంజ్ చేశాడని అర్థమవుతోంది. ‘చంచల్ గూడ’ షటిల్ టీం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక వైసీపీతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది.
దూకుడుగా.. వ్యక్తిగతంగా వెళుతున్న వైసీపీకి అదే అస్త్రంతో దెబ్బకొట్టాలని జనసేన రెడీ అయ్యింది. ఈక్రమంలోనే విమర్శిస్తున్న వైసీపీ మంత్రి గుడివాడకు జనసైనికులు పెట్టిన ముద్దు పేరు ‘చెత్తపుత్రుడు’.. అని సోషల్ మీడియాలో.. బయట నాయకులు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. సజ్జలను మాఫియా కింగ్ అంటూ ఆడిపోసుకుంటున్నారు. రాసలీల స్క్రిప్ట్ రెడీగా ఉందని.. చందాలు వేసుకొని మరీ వైసీపీ బూతు మంత్రులపై సినిమాలు తీస్తామంటూ జనసైనికులు ప్రకటిస్తున్నారు.
తమకంటే బూతుగా.. వ్యక్తిగతంగా.. ఏకంగా సినిమాలు తీస్తామనేసరికి వైసీపీ మంత్రుల్లో ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లు తిడితే పడే జనసేనను చూశాం..కానీ ఇప్పుడు మీదపడిపోతున్న జనసేనను చూసి వైసీపీ నేతల్లోనూ ఆందోళన నెలకొంది.
Also Read:KTR: కేటీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ ఆంధ్రా-తెలంగాణ గొడవ!