
తిరుపతిలో బీజేపీని జనసేన ‘గాజు గ్లాస్’ భయపెడుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన సపోర్టుతో పోటీచేస్తున్న బీజేపీకి ఇది షాకింగ్ లా మారింది. ఎందుకంటే జనసేన పార్టీ గుర్తు అయిన ‘గాజు గ్లాసు’ను తిరుపతి ఎన్నికల్లో ‘నవతరం ’ పార్టీ అభ్యర్థికి ఈసీ కేటాయించడం పెను దమారం రేపింది.
జనసేన గాజు గ్లాస్ గుర్తు ఎంతో ఫేమస్. ఈ గుర్తు చూసి చాలా మంది జనసైనికులు, ప్రజలు కూడా వేసే అవకాశం ఉంది. ఈ గుర్తు కేటాయింపుతో క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ నష్టపోయే ప్రమాదం ఉంది. కేంద్రంలో అధికారంలోకి ఉండి.. ఈసీ చెప్పుచేతుల్లో ఉన్న కూడా తిరుపతిలో జనసేన గుర్తు కేటాయింపుపై జనసైనికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన పార్టీ గత ఎన్నికల్లో ఈసీ నిర్ధేశించినన్నీ ఓట్లు సంపాదించలేకపోవడంతో ఆ పార్టీ ఇంకా రాజకీయ పార్టీగా హోదా పొందలేదు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేయకపోవడంతో ఆ సింబల్ జనసేనకు దక్కలేదు.
ఈ నేపథ్యంలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్ కు గాజు గ్లాస్ ను ఈసీ కేటాయించింది. ఇప్పటికే జనసేనాని ఎంట్రీతో ఊపులోకి వచ్చిన బీజేపీకి ఈ వార్త షాకిచ్చింది.
జనసేన పోటీచేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని.. రిజిస్ట్రర్ పార్టీ కాకపోవడం వల్ల జనసేనకు పర్మనెంట్ గుర్తు రాలేదని తెలుస్తోంది. అందుకే ఈ ఖాళీ గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ కేటాయించింది.