Nagababu: వైసీపీ పాలన దుర్మార్గమైనదని.. ఇప్పటికే ప్రజలు ఎన్నుకొని తప్పు చేశారని.. మరోసాని జగన్ ఏపీలో అధికారంలోకి వస్తే ఏపీ నుంచి కాందీశీకులు లాగా పక్క రాష్ట్రాలకు వలస పోతారని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా రాజధాని లేకుండా పరిపాలిస్తున్న ఏకైక సీఎం జగన్ అని నాగబాబు ఎద్దేవా చేశారు.రైతులు, జనసేన పోరాటం ఫలించి అమరావతియే రాజధానిగా హైకోర్టు ప్రకటించిందని.. ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు.

ఏపీలో ప్రతి పౌరుడిపై లక్ష రూపాయల అప్పు ఉందని.. ఇక తాగడానికి ‘గోల్డ్ మెడల్ ’ బ్రాండ్లు ఉన్నాయని నాగబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో జగన్ పాలన చూసి ఇప్పుడు అందరూ ఆందోళన చెందుతున్నారని.. ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారని నాగబాబు విమర్శించారు.
Also Read: Pawan Kalyan Target: పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా? కీలక ప్రకటనకు రంగం సిద్ధం!
జగన్ అధికారంలోకి వచ్చాక అప్పులు, తిప్పలు, కష్టాలు, కడగండ్లు మాత్రమే ఉన్నాయని.. అవి మరిచిపోవడానికి కొత్త రకం బ్రాండ్లు అమ్ముతున్నారని నాగబాబు విమర్శించారు. అప్పులపాలైన ఏపీపై మరింత అప్పులు చేస్తూ వైసీపీ సర్కార్ పెను భారం మోపుతున్నారని ఆరోపించారు.
Also Read: Ganta Srinivasarao: రాజీనామా కోసం గంటా పట్టు.. జనసేనలోకి జంపింగా?
ఇక ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. నేను ప్రయాణిస్తే వెన్నుపూస కదిలిందని నాగబాబు అన్నారు. ఏపీ ప్రజలను ఇతర రాష్ట్రాలకు వెళితే జాలీగా చూస్తారని ఆరోపించారు. జగన్ పాలనలో మంత్రులకు పని లేదని.. వారు ఏం చేయాలో తోచక ఫోన్లలో ఆవేదన వ్యక్తం చేస్తూ దొరికిపోతున్నారని నాగబాబు అన్నారు.
[…] TANA International Women’s Day Celebrations: ‘తానా’ మహిళా దినోత్సవ వేడుకలను చికాగోలో మార్చి 12వ తేదీ ఆదివారం రోజున అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. డా. ఉమా ఆరమండ్ల (తానా సర్వీసెస్ కో ఆర్డినేటర్) ఆధ్వర్యంలో ఈ మిడ్ వెస్ట్ లో ప్రప్రథమంగా మహిళా దినోత్సవ వేడుకలు శుభారంభంగా జరగడం ఎంతో శుభపరిణామం. ఈ వేడుకల్లో ‘తానా’ అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు, ‘తానా’ కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీ రాజా కసుకర్తి, ‘తానా’ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీ శశాంక్ యార్లగడ్డ, ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుడే , ‘తానా’ మీడియా చైర్ శ్రీటాగోర్ మలినేని, ‘తానా’ రీజినల్ రిప్రజెంటేటివ్ , సౌత్ యూనిట్ శ్రీ కిషోర్ యార్లగడ్డ మరియు కమిటీ సభ్యులు అందరూ, నేషనల్ కో చైర్స్, వెంకట్ బిత్రా, రామకృష్ణ కృష్ణస్వామి, ఫణి వేగుంట తదితరులు హాజరయ్యారు. […]
[…] Rajamouli Meets CM Jagan: సీఎం జగన్‌తో సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య భేటీ ముగిసింది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ‘RRR’ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సీఎంతో రాజమౌళి సమావేశమయ్యారు. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ‘RRR’ భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమాకనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి వెల్లడించారు. […]