G.O 217 Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య కారుల పొట్ట కొడుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారు. జీవో నెం.217 తీసుకొచ్చి మత్స్యకారుల ఉపాధి దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. దీనికి సంబంధించిన జీవో ప్రతిని చించేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఓ ప్రభుత్వ అధికారి పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే పనులు చేయడం లేదని వివరణ ఇచ్చారు. దీంతో మత్స్యకారుల భవితవ్యం ఆందోళనలో పడిందని తెలుస్తోంది.
ప్రభుత్వం చేపల పెంపకంపై ఫోకస్ పెడుతోంది. మత్స్య సంపదను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వంద హెక్టార్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్న చెరువులను వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో మత్స్యకారుల కంటే దళారులే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి చెరువులను సొంతం చేసుకునే అవకాశం ఏర్పడింది. దీంతో మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని వాపోతున్నారు.
Also Read: బీజేపీకి సైతం అసమ్మతి పొగ తప్పడం లేదా?
దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తున్నారు. భవిష్యత్ లో మత్స్యకారుల ఉపాధికి విఘాతం కలిగించేందుకే జీవో తీసుకొచ్చిందని చెబుతున్నారు. దీంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు పెద్ద చెరువులను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రభుత్వం తరువాత చిన్న చెరువులను సైతం బహిరంగ వేలానికి సిద్ధం చేసేందుకు ఉపక్రమించే అవకాశం ఉందని చెబుతున్నారు.
చెరువుల ద్వారా వైసీపీ నేతలు లబ్ధిపొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బహిరంగ వేలం వేస్తూ ఆదాయం ఆర్జించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ పన్నాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని పవన్ కల్యాణ్ పేర్కొనడం గమనార్హం. మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రభుత్వం వారి పొట్ట కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారుల ఉపాధికి అడ్డంకులు కల్పించడం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీకి రిలీజ్ ముందు బిగ్ షాక్