2024 ఎన్నికల్లో ఏపీలో జనసేన గెలవబోతోందని.. భయం లేకుండా విచ్చలవిడిగా చెలరేగుతున్న వైసీపీకి భయం అంటే ఏంటో తాను చూపిస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కుక్కల్లా మొరిగేస్తే భయపడనని.. ఇక వైసీపీ నేతలకు మదం, మత్య్సర్యం అన్నీ ఉన్నాయని.. లేనిదల్లా భయం మాత్రమేనని.. వైసీపీ నేతలకు ఆ భయం నేను నేర్పిస్తానని పవన్ అన్నారు. వైసీపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాల ముసుగులో దాక్కుంటున్నారని పవన్ విమర్శించారు.

వైసీపీ గ్రామ సింహాల ఘోంకారాలు సహజం అని.. జనసైనికుల సింహగర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు. ఊరకుక్కల వలే మొరిగితే మేం భయపడమని.. ఇంట్లో కూర్చొని ఏడ్వమని.. అంతకుమించిన మొండి ధైర్యంతో వైసీపీని ఎదుర్కొంటామని పవన్ సవాల్ చేశారు. తాను వైసీపీ నేతల్లా బూతులు తిట్టలేనని.. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు నేర్పారని.. వైసీపీ నేత ఇంట్లో ఆడవారిపై కూడా తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నానని పవన్ అన్నారు.
నాకూ బూతులు వచ్చని.. గుంటూరు, బాపట్ల , పిడుగురాళ్లలో తిరిగిన వాడినని.. మాట్లాడలేక కాదంటూ పవన్ రెచ్చిపోయారు. జగన్ బాబాయిని ఎవరు చంపారు? కోడికత్తి దాడి ఎందుకు జరిగిందంటే? వాటికి సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దాడి చేస్తారా? అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ నేతలది నాకంటే రంగుల జీవితం అన్నారు.
ఇక ప్రజారాజ్యం పార్టీతో ముందుకొచ్చి వెనకడుగు వేశామని.. ఇక వైసీపీ నేతలు ఎంత వేధించినా వెనకడుగు వేసే పరిస్థితి లేదని పవన్ చెప్పుకొచ్చాడు. సాటి మనిషికి స్పందించే గుణం నాలో ఉందని.. సేవ చేయడానికే వచ్చానన్నారు. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారని.. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడుతాను తప్ప బలహీనపడను అని స్పష్టం చేశారు. నా అంతట నేను యుద్ధం చేయనని.. నేను బలపడుతాను తప్పితే బలహీనపడను అని అన్నారు.
ఓట్లన్నీ వైసీపీకి వేసి పని నన్ను చేయమంటే ఎలా అని ప్రజలను ప్రశ్నించారు. ఓట్లువేసి గెలిపిస్తే కదా మోడీనైనా…? జగన్ ను అయినా ఎదురించడానికి వీలుంటుందని పవన్ ప్రజల తప్పును గుర్తు చేశారు. పవన్ రెండు చోట్ల ఓడాడని.. ఇక ప్రజల తరుఫున కొట్లాడే శక్తి నాకు లేకుండా మీరే చేశారని ప్రజల తీరులో మార్పు రావాలని.. పనిచేసేవారిని.. అండగా నిలబడే వారిని గెలిపించాలని సూచించారు
దేశం కోసం వైసీపీ నేతల తిట్లు తింటానని పవన్ అన్నారు. మొరిగే కుక్కలను పట్టించుకోను అని ఇక రాజకీయంగా వారిని ఎదుర్కొటానని.. సోషలిజాన్ని పక్కనపెడుతున్నట్టు తెలిపారు.
-తెలంగాణకు, ఏపీకి మధ్య తేడా కులాల కంపే: పవన్ కళ్యాణ్
తెలంగాణకు ఏపీకి మధ్య తేడా కులాల కంపేనని.. తెలంగాణ కోసం అక్కడ పార్టీలు, సంఘాలు, కులమతాలు పక్కనపెట్టి కలిసికట్టుగా వస్తారని.. కానీ ఏపీలో మాత్రం కులాల వారీగా చీలిపోతారని పవన్ అన్నారు. తాను ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఒక కులం పోరుగా గుర్తించి ఎవరూ నాతో కలిసి రాలేదని పవన్ చెప్పుకొచ్చాడు.
-ముఖ్యమంత్రి పదవిపై కోరిక బయటపెట్టిన పవన్
ఇక వచ్చేసారి జనసేననే గెలుస్తుందని.. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి ఏపీలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో.. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో తాను చూపిస్తానని పవన్ అన్నారు. ఒక ఆడబిడ్డ రోడ్డుపై వెళితే చూడాలంటేనే భయపడేలా పాలిస్తానని చెప్పుకొచ్చాడు..
-వైసీపీ దుష్టపాలన అంతమొందిస్తా.. వచ్చేది జనసేన ప్రభుత్వమే..
వైసీపీ దుష్టపాలనను అంతమొందిస్తానని పవన్ అన్నారు. పవన్ రెండు చోట్ల ఇప్పుడు ఓడిపోయాడని.. వచ్చేసారి వైసీపీ 15 సీట్లకు పడిపోతుందని.. జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చాడు. వైసీపీకి పాండ సభ చూపిస్తానన్నారు.
-యుద్ధానికి మీరే పిలిచారు
యుద్ధానికి వైసీపీనే పిలిచిందని.. మేం రంగంలోకి దిగామని.. ఇక సోషలిజం వదిలేసి రాజకీయం మొదలుపెడుతామని.. వైసీపీ నేతల తాటతీసేదాకా వదిలిపెట్టమని పవన్ నిప్పులు చెరిగారు. ఇక ప్రత్యక్ష కార్యాచరణతో ముందుకెళుతామని పిలుపునిచ్చారు.
- పవన్ మాట్లాడిన పూర్తి వీడియోను కింద చూడొచ్చు.