Pawan TDP : జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తులపై సంచలన ప్రకటన చేశారు.ఆంధ్రప్రదేశ్ ను షేక్ చేసే నిర్ణయాన్ని ప్రకటించారు. అధికార వైసీపీని ఓడించడానికి ప్రజలకు ఉపయోగపడే పొత్తులు ఉండాలని ఆకాంక్షించారు. పరోక్షంగా టీడీపీతో పొత్తుపై కూడా నర్మగర్భబ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్మాయ ప్రభుత్వ యాత్నాన్ని బలంగా ముందుకు తీసుకెళుతామని చెప్పారు. దీన్ని బట్టి ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఆహ్వానిస్తే తప్పకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. బీజేపీతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ స్పష్టం చేశారు. పొత్తు ప్రజలకు ఉపయోగపడేలా చూస్తానని ప్రకటించారు. నా వ్యక్తిగత ఎదుగుదలను ఎప్పుడూ చూడలేన్నారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు ప్రజల పక్షాన నిలబడేందుకు బయటకు వస్తానన్నారు. వ్యక్తిగత లాభాపేక్ష పెట్టుకోనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వ దారుణ పాలన వల్లనే తాను ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అని ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎవరినీ రాష్ట్రంలో బతకనివ్వడం లేదని.. సమస్యలన్నీ చూసి ఏపీ భవిష్యత్తుకు బలమైన పార్టీలన్నీ కలిసి రావాలని పరోక్షంగా టీడీపీని పవన్ ఆహ్వానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో తెలుసు అన్నారు. ఖచ్చితంగా ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్మాయం రావాల్సిన అవసరం ఉందని పవన్ ప్రకటించారు. దీన్ని జనసేన ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
Also Read: Mehreen Pirzada: ఆ డైరెక్టర్ జీవితంతో ఆడుకుంటున్న హీరోయిన్ !
టీడీపీ ఏపీలో పొత్తు కోసం ఆహ్వానిస్తే మాట్లాడుతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళుతాం’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నానని పవన్ తెలిపారు.
ప్రత్యామ్మాయ ప్రభుత్వం అనేది ప్రజల కోరిక.. ఎమర్జెన్సీ సమయంలో దేశం అట్టుడుకుతున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలిచాయి.. వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిదిద్దాలంటే ఓటు చీలకూడదని.. అదే జరిగితే ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందరూ కలిసివచ్చి విశాలదృష్టితో పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలకు భరోసా కల్పించాలని పవన్ పిలుపునిచ్చారు. అలా చేస్తేనే భవిష్యత్తులో తేలుతుందని ప్రకటించారు. ఏపీ భవిష్యత్తు కోసం అందరూ తోడ్పడాలని కోరారు.
దీన్ని ఏపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ పిలుపునిస్తే ఆ పార్టీతో వెళ్లేందుకు ప్రజల కోసం ఆలోచిస్తానని పరోక్షంగా ప్రకటించారు. బీజేపీతోనూ బంధం అద్భుతంగా కొనసాగుతుందన్నారు. దీన్ని బట్టి ఏపీలో బీజేపీ, టీడీపీ జనసేన కలిసి వెళుతుందని.. వైసీపీని ఓడించేందుకు త్యాగాలు చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు అధికార వైసీపీలో గుబులు రేపుతోంది.
Recommended Videos: