Pawan Kalyan- Jagan: రాజకీయంగా ఇంతకాలం స్తంబ్ధుగా ఉన్న జన సేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల దూకుడు పెంచారు. పవన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసే విమర్శల నుంచి బయట పడేందుకు ప్రజా సమస్యల జెండా ఎత్తుకున్నారు. ఇటీవల కౌలు రైతులు, యువత, నిరుద్యోగులు, జాలర్లు, రోడ్ల దుస్తితిపై ఉద్యమం చేస్తున్నారు. పవన్ రాజకీయాలపై సీఎం జగన్ సినిమా తక్కువ.. ఇంట్రవెల్ ఎక్కువ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో రాజకీయ విమర్శల నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ హఠావో నినాదంతో..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ లేని ప్రభుత్వం రావాలని పవన్ ఇటీవల తరచుగా పిలుపునిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ జనసేన ఇతర పార్టీలపై ఆధారపడుతుందన్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం కూడా పవన్ ప్రారంభించారు. గతంలో జనసేనానే స్వయంగా బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎన్నికలు లేని వేల బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడడంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలకు కూడా పవన్‌పై విశ్వాసం పెరుగ లేదు. ఈ విషయాన్ని గుర్తించిన పవన్ జనసేన స్వతంత్రంగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యలపై స్వయంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. వైసీపీ లేని ప్రభుత్వం వస్తుందని, ‘ముద్దుల మామయ్య’’ను ఇంటికి పంపించాలని పిలుపునిస్తున్నారు.
Also Read: Kaleshwaram Project: లక్ష కోట్ల కాళేశ్వరం ఎందుకు మునిగినట్టు?
ఓటు బ్యాంకు.. పట్టున్న జిల్లాలపై దృష్టి..
సొంతంగా రాజకీయాలు ప్రారంభించిన జనసేనాని మొదట పార్టీకి పట్టున్న జిల్లాలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వని తీరును ఎండగడుతున్నారు. వాస్తవంగా ఈ జిల్లాల్లో కాపులు ఎక్కువ. ఇక్కడి నుంచే ప్రజా సమ్యలపై పోరాటం మొదలు పెట్టడం ద్వారా జిల్లాల్లో పార్టీ బలపడడంతోపాటు ఓటు బ్యాంకును కాపాడుకోవచ్చని జన సేనాని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉమ్మడి తూర్పు, పశ్చిమ జిల్లాలపై దృష్టిపట్టారు.
జనసేన ప్రభుత్వమే వస్తుందంటూ..
రాష్ట్రంలో ఎప్పడు ఎన్నికలు జరిగినా జనసేన అధికారంలోకి వస్తుందటూ పవన్ ఇటీవల తరచూ చెబుతున్నారు. తద్వారా క్యాడర్‌లో ఉత్సాహం తగ్గకుండా చూసుకుంటున్నారు. గతంలో బీజేపీతో పొత్తు గురించి ప్రస్తావించే పవన్, ఇప్పుడు జనసేన ప్రభుత్వమే అంటూ స్పష్టత ఇస్తున్నారు. దీంతో క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది. పొత్తుల గురించి ఇప్పుడు ప్రస్తావించడం ద్వారా పార్టీ అస్తిత్వం దెబ్బతింటుందని గుర్తించిన జనసేనాని ఆంధ్రప్రదేశలో ఏర్పడేది జన సేన ప్రభుత్వమే అని అంటున్నారు. పొత్తుల విషయం ఎన్నిల సమయంలోనే ప్రస్తావించాలని భావిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా..
మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా కూడా జనసేనాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈమేరకు ఆయన వైసీపీ లేని ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నారు. తద్వారా ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా హింట్ ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై మాత్రం తాను ముఖ్యమంత్రి అవ్వొచ్చు, కాకపోవచ్చు కానీ, మొత్తంగా వైసీపీ లేని ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. మొత్తంగా తన దూకుడు ద్వారా జగన్‌కు రాజకీయ సినిమా చూపించాలన్న భావనతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read:CM KCR Fired On Forest Department: ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో దొంగలు.. కేసీఆర్ క్లాస్ పీకాడా?