https://oktelugu.com/

JanaSena- Pawan Kalyan: జనసేన సర్వేలు: పవన్ కింగ్ మేకర్.. వైసీపీ పరిస్థితి ఇదీ.. ఏం తేలిందో తెలుసా?

JanaSena- Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఆదరబాదరాగా కాకుండా పకడ్బందీ ప్లాన్ తోనే సాగుతున్నారు. అందరూ అనుకున్నట్టు ఈ దసరా నుంచి పవన్ పాదయాత్ర చేయడం లేదు. ముందే ప్రకటించినా కూడా ఆ డేట్ ను వాయిదా వేశారు. దీనికి కారణం ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే తొందరపడి ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నికల చివరి సంవత్సరం యాత్ర సహా ప్రజల్లోనే ఉంటే బెటర్ అని ఈ ప్లాన్ చేసినట్టు […]

Written By: NARESH, Updated On : September 20, 2022 12:34 pm
Follow us on

JanaSena- Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వెళుతున్నారు. ఆదరబాదరాగా కాకుండా పకడ్బందీ ప్లాన్ తోనే సాగుతున్నారు. అందరూ అనుకున్నట్టు ఈ దసరా నుంచి పవన్ పాదయాత్ర చేయడం లేదు. ముందే ప్రకటించినా కూడా ఆ డేట్ ను వాయిదా వేశారు. దీనికి కారణం ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే తొందరపడి ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నికల చివరి సంవత్సరం యాత్ర సహా ప్రజల్లోనే ఉంటే బెటర్ అని ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

JanaSena- Pawan Kalyan

Pawan Kalyan

తాజాగా జనసేన పార్టీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధికార వైసీపీకి 44-65 సీట్లలోపే వస్తాయని తేలిందట.. దీంతో మరో 100 స్థానాల్లో ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన గెలవడం ఖాయం. నిజంగా ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ ఓటమి ఖాయం. పవన్ తలుచుకున్నట్టు అధికార వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక రావద్దు. ఈ వ్యూహంతో వెళితే మాత్రం ఖచ్చితంగా జగన్ పార్టీని ఓడించవచ్చని తేలిందట..

Also Read: Pawan Kalyan- YCP: పవన్ జోలికి వెళ్లోద్దు.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు..

అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను రద్దు చేసుకొని ఎన్నికల ముందర నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు తెలిసింది. జనసేన ఒంటరిగా వెళ్లినా.. టీడీపీ కలిసి వెళ్లినా పవన్ కళ్యాణ్ యే కింగ్ మేకర్ అవుతాడని అంటున్నారు. కర్ణాటకలో కుమారస్వామిలా ఏపీలో పవన్ దాదాపు 40 సీట్లు కొట్టి టీడీపీ మద్దతుతో సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పొత్తు పొడిస్తేనే పవన్ సీఎం ఆశ నెరవేరుతుంది.

JanaSena- Pawan Kalyan

Pawan Kalyan

ఇప్పటికే చంద్రబాబు ఏపీకి మూడు మూడు సార్లు సీఎం అయ్యారు. ఆయన 40 ఇయర్స్ పాలిటిక్స్.. వయసు మీద పడింది. కాబట్టి వైసీపీకి తక్కువ సీట్లు వచ్చి టీడీపీ, జనసేనకు ఎక్కువ సీట్లు వస్తే పవన్ సీఎం కావడం ఖాయమని తేలింది. జనసేన సర్వేలోనూ వైసీపీకి మెజార్టీకి తక్కువగా 65లోపే సీట్లు వస్తాయని తేలింది. సో వచ్చేసారి జనసేనకు సువర్ణావకాశం అని.. పవన్ సీఎం కల నెరవేరబోతోందని అంటున్నారు.

Also Read:Manchu Manoj- TDP: తెలుగు దేశంలోకి మంచు మనోజ్.. పోటీ అక్కడి నుంచే.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Tags