Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Volunteers: ఏపీలో అన్ని వేల మంది మహిళలు కనిపించడం లేదా? నిజమెంత?

Pawan Kalyan Volunteers: ఏపీలో అన్ని వేల మంది మహిళలు కనిపించడం లేదా? నిజమెంత?

Pawan Kalyan Volunteers:  ఆ మధ్యన వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేరళ నుంచి 32 వేల మంది యువతుల మిస్సింగ్ ఇతివృత్తంగా చేసుకొని తీసిన సినిమా ఎన్నెన్నో వివాదాలకు కారణమైంది. భారతీయ యువతులను ఇస్లామిక్ మిలిడెంట్ సంస్థలు వైట్ వాష్ చేసి విదేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలకు వాడుకుంటున్నారన్నది ఈ కథ సారాంశం. అయితే ఇది సంఘ్ పరివార్ దుష్ఫ్రచారంగా ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల మాటేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో మహిళల అదృశ్యం గురించి రకరకాల కథనాలు కూడా బయటకు వచ్చాయి. అయితే అందులో తెలుగు రాష్ట్రాలు ముందుండడం ఆందోళన కలిగించే విషయం.

జాగా పవన్ కళ్యాణ్ మహిళల అదృశ్యం గురించి ప్రస్తావించడం విశేషం. కేంద్ర నిఘా సంస్థ ఎన్సీఆర్బీ సమాచారంతో పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇందులో ఏపీలో వ్యక్తిగత సమాచార గోప్యత కారణంగానే మహిళల అదృశ్యాలు పెరుగుతున్నట్టు సంబంధిత ఎన్సీఆర్బీ అధికారులు చెప్పినట్టు పవన్ చెప్పుకొచ్చారు. అయితే గతంలో కేరళ స్టోరీ సినిమా వివాదాల సమయంలో సైతం ఎన్సీఆర్భీ నివేదికలు అంటూ గణాంకాలు విడుదలయ్యాయి. అందులో ఒక్క 2021 సంవత్సరంలోనే ఏపీలో 10,085 మంది మిస్సింగ్ అయినట్టు ఎన్సీఆర్బీ గుర్తించినట్టు కథనాలు వచ్చాయి. అందులో చాలా మంది తిరిగి వచ్చినా.. ఆచూకీ లేని వారి సంఖ్య వేలల్లోనే ఉంటుందని వార్తలు వచ్చాయి.

అయితే ఏపీలో మహిళల అదృశ్యం వెనుక మానవ అక్రమ రవాణాయే కారణంగా తెలుస్తోంది. ఈ మానవ అక్రమ రవాణాలో శ్రమ, లైంగిక దోపిడీ అధికంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో విద్య, ఉపాధి మెరుగుపడకపోవడంతో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అక్కడ అక్రమార్కుల బారిన చిక్కి నరకయాతన పడుతున్నారు. ప్రధానంగా యునైటెడ్ అరబిక్ దేశాల్లో ఎక్కువ మంది చిక్కుకుంటున్నారు. ఆచూకీ కనిపించకుండా పోతున్నారు. అయితే ఇదంతా వ్యక్తిగత గోప్యత సమాచారం బయటకు వెళ్లడం వల్లే ఇలా జరుగుతోందని ఎన్సీఆర్బీ ఒక అంచనాకు వచ్చింది. దీనిపై అధ్యయనం కూడా చేస్తోంది.

ఇంత జరుగుతున్నా ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా భద్రత వదిలి పోలీస్ శాఖ రాజకీయ సేవలో తరిస్తుందన్న అపవాదు మూటగట్టుకుంది. బదిలీలకు, పదోన్నతులకు ఆశపడి కొందరు మోకరిల్లేసరికి పోలీస్ శాఖ ఔన్నత్యం దెబ్బతింటోంది. కొందరు చేస్తున్న పనులకు పోలీస్ శాఖ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.ప్రజా భద్రత తమ ప్రధాన కర్తవ్యమని తెలిసినా కొందరు అధికారులు పట్టించుకోవడం లేదు.

పోలీస్ శాఖలో వింత పోకడ కనిపిస్తోంది. ఫిర్యాదుదారుల స్థితిగతులను బట్టి కేసుల నమోదు, పురోగతి ఉంటోంది. మొన్నటికి మొన్న 100 మీటర్ల దూరంలో ఓ బాలిక అదృశ్యమై కిడ్నాపరు చేతిలో 20 రోజుల పాటు ఉంటే గుర్తించలేని స్థితిలో పోలీస్ శాఖ ఉంది. నిన్నటికి నిన్న విశాఖ నగర బొడ్డున ఓ నేవీ అధికారి కూతురే సామూహిక గ్యాంగ్ రేపునకు గురైంది. ఇలా చెప్పుకుంటూ పోతే వైఫల్యాలే తప్ప..మరొకటి కనిపించదు. ఇప్పుడు పవన్ మహిళల అదృశ్యం గురించి ప్రస్తావించేసరికి ప్రభుత్వం ఉలిక్కిపడింది. బాధ్యతాయుతమైన ఓ పార్టీ అధినేతగా సామాజికవ సమస్యను ప్రస్తావించిన జీర్ణించుకోలేని స్థితిలో జగన్ సర్కారు ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular