https://oktelugu.com/

Janasena 10th Formation Day : మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ చారిత్రాత్మకం కాబోతుంది

అంతులేని జనాదరణ.. బయటకు వస్తే వేలాది మంది జనం. ఇది జనసేనాని పవన్ ఇమేజ్. కానీ ఎన్నికల్లో ఓటమి. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినా నిరాదరణ. వీటన్నింటినీ గుణపాఠాలుగా నేర్చుకొని 2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్నారు. పార్టీ పదో ఆవిర్భావ సభలో అన్ని అంశాలపై స్పష్టతనివ్వనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో ఆవిర్భావ సభ జరగనుంది. అందులో భాగంగా సన్నాహాకంగా పార్టీ కార్యాలయంలో బీసీలతో పవన్ సమావేశమయ్యారు. తాను ఓడిపోవడానికి గల కారణాలను వివరించారు. బీసీల విషయంలో జరుగుతున్న […]

Written By: , Updated On : March 13, 2023 / 09:20 PM IST
Follow us on

మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభ చారిత్రాత్మకం కాబోతుంది | Janasena 10th Formation Day | Ok Telugu

అంతులేని జనాదరణ.. బయటకు వస్తే వేలాది మంది జనం. ఇది జనసేనాని పవన్ ఇమేజ్. కానీ ఎన్నికల్లో ఓటమి. రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినా నిరాదరణ. వీటన్నింటినీ గుణపాఠాలుగా నేర్చుకొని 2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్నారు. పార్టీ పదో ఆవిర్భావ సభలో అన్ని అంశాలపై స్పష్టతనివ్వనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో ఆవిర్భావ సభ జరగనుంది. అందులో భాగంగా సన్నాహాకంగా పార్టీ కార్యాలయంలో బీసీలతో పవన్ సమావేశమయ్యారు. తాను ఓడిపోవడానికి గల కారణాలను వివరించారు. బీసీల విషయంలో జరుగుతున్న దగాపై కూడా కామెంట్స్ చేశారు. కాగా మచిలీపట్నంలోని 36 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. దీనికి పొట్టి శ్రీరాములు ప్రాంగణంగా పేరు పెట్టారు. దీనికి సంబంధించి పోస్టర్ ను సైతం ఆవిష్కరించారు.

తాను ఏదో ఒక కులానికి చెందిన నాయకుడిని పవన్ స్పష్టం చేశారు. తమపై కాపుల పార్టీగా ముద్ర వేస్తున్నారని.. అటువంటప్పుడు కాపులు బలంగా ఉన్న ప్రాంతాల్లో తాము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో కాపులు, శెట్టిబలిజల మధ్య ఐక్యతకు కృష్టిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో బీసీలే తనకు అండగా నిలిచారని చెప్పారు. అందుకే బీసీల్లో ఐక్యత, రాజ్యాధికారం కోసం చివరి వరకూ పోరాడుతానని పవన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జనసేన ఆవిర్బావ సభలో పవన్ ఏం చెప్పనున్నారన్నది ఆసక్తి రేపుతోంది.

ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.