
India Lithium Reserves: పాకిస్తాన్ తన కొంప కూలిపోతున్నా పట్టించుకోదు కానీ.. భారత్ పచ్చగా ఉంటే మాత్రం కుమిలిపోతుంది.. నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతుంది. బహుశా దాని బుద్దే అంత. అందుకే భారత్ అంతకంతకు వృద్ధి చెందుతుంటే… పాకిస్తాన్ మాత్రం పాతాళానికి వెళ్ళిపోతోంది. అప్పులు తెస్తే తప్ప పూట గడవని స్థాయికి దిగజారుతోంది. ఇదే దశలో ఐఎంఎఫ్ ఇచ్చే అప్పుల కోసం దీనంగా ఎదురుచూస్తోంది.. ఇలాంటి స్థితిలో ఏ దేశమైనా ఉంటే ముందు తన పరిస్థితిని చక్క దిద్దుకుంటుంది.. కానీ అక్కడ ఉన్నది పాక్ కాబట్టి, దాన్ని ఉగ్రవాదులు చెరబట్టారు కాబట్టి.. అది పాములాగా బుసలు కొడుతోంది.
Also Read: Tripura Election: 25 ఏళ్లు ఏలిన పార్టీకి అధికారం దక్కుతుందా.. త్రిపుర ప్రజలు ఎవరి వైపు ?
ఇటీవల జిఎస్ఐ అధికారుల సర్వేలో జమ్ములోయలో 50 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు వెల్లడి అయింది.. వీటి తవ్వకాలు గనక జరిగితే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తేలింది. ప్రపంచానికే దిక్సూచిగా మారుతుందని తేటతెల్లమైంది.. ఇలా ఎప్పుడైతే తెలిసిందో ఇక అప్పటినుంచి పాకిస్తాన్ కారాలు మిర్యాలు నూరడం మొదలుపెట్టింది.. ఏకంగా పాకిస్తాన్ దేశం లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే జైషే మహమ్మద్ సంస్థ భారతదేశానికి ఎట్టి పరిస్థితిలో లిథియం నిల్వలు దక్కనియ్యబోమని స్పష్టం చేసింది.. అంతేకాదు ఆ నిలువలపై బాంబు దాడులు చేస్తామని హెచ్చరించింది.

ఈ ఉగ్రవాద సంస్థ నాయకుడు పాకిస్తాన్లో ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, అతని తమ్ముడు ఉగ్రవాద సంస్థకు నాయకుడిగా చలామణి అవుతున్నాడు. భారత్ లిథియం తవ్వకాలు మొదలు పెడితే ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, తర్వాత తమ దేశం పని పడుతుందని భయపడి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.. మరోవైపు ఆ లిథియం నిల్వలు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయంటూ వితండవాదం చేస్తున్నారు.. అంతేకాదు తవ్వకాలు జరిపే కాంట్రాక్ట్ కంపెనీలపై దాడులు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. అయితే త్వరలోనే లిథియం తవ్వకాలను భారత చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తమకు లిథియం సరఫరా చేయాలని భారతదేశాన్ని అంతర్గతంగా కోరినట్టు తెలుస్తోంది.. ఇదే సమయంలో జై షే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను నిషేధిత జాబితాలో పెట్టేందుకు భారత వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఐక్యరాయ్ సమితి భద్రత సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తే ఆకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం..
Also Read: Jayamangalam Venkataramana: టీడీపీకి పెద్ద షాక్.. పార్టీని వీడిన మరో నేత