ఏపీ పేదల ఆకలి ప్రభుత్వానికి పట్టదా?

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. ఓసారి జగన్ పై కత్తికడుతాడు.. ఓసారి ఆయన లోపాలు ఎత్తిచూపుతాడు. ఇన్నాళ్లు అందరికీ లేఖలు రాసి రాజకీయం పెంచిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తాజాగా ఏకంగా సీఎం జగన్ కే లేఖలు రాస్తూ ఠారెత్తిస్తున్నారు. ‘నవ ప్రభుత్వ కర్తవ్యాలు’ పేరుతో ఏపీ సీఎం జగన్ కు తాజాగా మరో లేఖ రాశారు. చంద్రబాబు ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్లు’ను జగనన్న క్యాంటీన్ల పేరుతో ప్రారంభించాలని జగన్ కు లేఖలో […]

Written By: NARESH, Updated On : June 22, 2021 10:06 am
Follow us on

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారశైలి రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. ఓసారి జగన్ పై కత్తికడుతాడు.. ఓసారి ఆయన లోపాలు ఎత్తిచూపుతాడు. ఇన్నాళ్లు అందరికీ లేఖలు రాసి రాజకీయం పెంచిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తాజాగా ఏకంగా సీఎం జగన్ కే లేఖలు రాస్తూ ఠారెత్తిస్తున్నారు. ‘నవ ప్రభుత్వ కర్తవ్యాలు’ పేరుతో ఏపీ సీఎం జగన్ కు తాజాగా మరో లేఖ రాశారు.

చంద్రబాబు ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్లు’ను జగనన్న క్యాంటీన్ల పేరుతో ప్రారంభించాలని జగన్ కు లేఖలో కోరారు. శత్రువును కూడా ఓ మంచి కార్యక్రమం కోసం ఆయన పేరు పెట్టుకోవాలని.. పేదల ఆకలి తీర్చాలని ఎంపీ రఘురామ కోరడం హాట్ టాపిక్ గా మారింది.

అన్నదానం అన్ని దానాల్లోకెల్లా పెద్దది అని.. అన్నదానం ద్వారా మంచి పేరు రావడమే కాకుండా ‘దైవదూత’ అనే పేరు వస్తుందని.. తక్షణమే ‘జగనన్న క్యాంటీన్లు’ పథకం ఏపీలో ప్రారంభించాలని రఘురామ కోరారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం,,రాత్రి భోజనం అందించేవారు. మూడు విడతల్లో రూ.15 కే పేదలకు ఒక రోజు తిండి ఖర్చు పూర్తయ్యేది. ఇది లేకపోతే పేదలకు రూ.150 ఖర్చు అవుతుందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఈ మూడు పూటల ఆహారానికి కలిపి కేవలం రూ.58మాత్రమే ఖర్చు అవుతుందని రఘురామ లెక్కలతో కొట్టాడు.

అన్న క్యాంటీన్లతో ఏపీలో ఏకంగా 2.15 లక్షల మంది పేదలు, కార్మికులు బాటసారులు ఆకలి తీర్చుకునేవారు. గత చంద్రబాబు ప్రభుత్వం దీనికోసం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేసింది. దాతల నుంచి విరాళాలు సేకరించి 35 పట్టణాల్లో 100 క్యాంటీన్లు,75 పట్టణ ప్రాంతాలలో 103 అన్న క్యాంటీన్లు, మొత్తం 73 మున్సిపాలిటీలలో 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది.

ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేశారు. ఇప్పుడు వాటిని పునరుద్దరించాలన్న డిమాండ్ ఏపీ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఎంపీ రఘురామ సైతం ఇదే విషయంపై తాజాగా లేఖ రాయడం విశేషం.