Homeఆంధ్రప్రదేశ్‌CM JAGAN: జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా.. సాధిస్తారా? లేదా?

CM JAGAN: జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా.. సాధిస్తారా? లేదా?

CM JAGAN: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య జరిగే భేటీ చర్చల్లో ముఖ్యంగా మూడు రాజధానులు, పోలవరం అంశం, విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరగనుందని, ప్రభుత్వ వర్గాలతో పాటు వైసీపీకి చెందిన వారు సైతం చెబుతున్నారు. కానీ ప్రధాని మోడీ, సీఎం జగన్ ఈ రెండున్నరేళ్ల కాలంలో చాలా సార్లు భేటీ అయ్యారు. కానీ ఎప్పడు భేటీ అయినా ఈ అంశాలకు సంబంధించిన విషయాన్ని మాత్రమే ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేశారు.

CM JAGAN
CM JAGAN

ప్రస్తుతం జరపబోతున్న భేటీ తర్వాత కూడా ఇవే అంశాలకు సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల కానుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవానికి ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీకి ఉన్న కష్టాలు మాములు కష్టాలు కాదు. అందులో ఆర్థిక సమస్య చాలా ముఖ్యమైంది. ప్రస్తుతం ఆర్బీఫ నుంచి రాష్ట్రం తీసుకునే బాండ్ల అప్పుల కోసం పర్మిషన్ రావాల్సి ఉంది. అది గనక సోమవారం రాకపోతే.. ఆర్బీఐ మంగళవారం వేసే బాండ్ల వేలంలో పాల్గొనేందుకు చాన్స్ ఉండదు.

Also Read:  కొత్త సంవత్సరంలో అదిరిపోయే వాట్సాప్ ఫీచర్స్.. అవేమిటంటే!

ఎందుకంటే ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్ల కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలనేది ఆ రాష్ట్రానికి ఇప్పుడు పెద్ద సమస్య. ఫస్ట్ దీని నుంచి బయటపడాలి. ఇవి కాకుండా ఇంకా చాలా సమస్యలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి తోడు వివేకా హత్య కేసు సైతం రాజకీయ సమస్యలను సృష్టించడమే ఖాయమని కనిపిస్తున్నది. మరో వైపు సీబీఐ పైనే ఎదురుదాడి చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. దీనిపై ఆరోపణలు వస్తున్నాయి, పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి.

ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి సైతం తెలయకుండా ఉండవు కదా.. ఇన్ని సమస్యల మధ్య ప్రధానితో జగన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. మరింత లోపల ఎలాంటి చర్చలు, నిర్ణయాలు జరుగుతాయనేది మాత్రం అధికారంగా స్పష్టత రావడం కష్టం. చూడాలి మరి సమస్యల నుంచి రాష్ట్రాన్ని, జగన్‌ను ప్రధాని బయటపడేస్తారా? లేదా అనేది ఆసక్తిగా మారింది.

Also Read: “ది బాస్” మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన నటుడు సునీల్… ఆర్జీవి బాబా అవతారం ?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular