Kapu Politics: రాష్ట్రంలో ఒక విక్రుత రాక్షస క్రీడకు తెరతీశారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రతిబంధకంగా మారుతారని జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. దారికి తెచ్చుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాపు సామాజికవర్గం పవన్ వెంట నడవకుండా ఉండేందుకు ఆ వర్గంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాజకీయంగా పవన్ దూకుడు పెంచడంతో జగన్ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పవన్ తన కంట్లో నలుసుగా మారారని నొచ్చకుంటున్నారు. పవన్ రైతుభరోసా యాత్రల పేరిట జనాల్లోకి వస్తుండడం, యువత ఆదరణ పెరుగుతుండడం, పవన్ పొత్తుల ప్రకటన చేస్తుండడంతో జగన్ లో అభద్రతా భావం పెరిగిపోయింది. ఓటమి భయం పట్టకుంది. దీంతో తనకు అచ్చొచ్చిన కుల రాజకీయాలకు తెరతీశారు. తాజాగా తన కేబినెట్ లోకి తీసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజాలను పురిగొలిపారు. అధినేత ఇచ్చిన టాస్కును పూర్తిచేయాలన్న ఆత్రుతతో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా విపరీత వ్యాఖ్యానాలు చేశారు. కుటుంబసభ్యులను తెరపైకి తెచ్చి కించపరుస్తూ మాట్లాడారు. దీనిపై జన సైనికులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సామాజికవర్గం నాయకులు, ప్రతినిధులు సైతం స్పందించారు. ఆ ముగ్గురు మంత్రుల తీరును తప్పుపట్టారు. వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు.

అయితే ముగ్గురు మంత్రుల తీరును జన సైనికులు, పవన్ అభిమానులు సీరియస్ గా తీసుకున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో విమర్శలు కురిపిస్తున్నారు. వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రులు తరచూ పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతుండడం తో కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిత్వ, కుటుంబ గౌరవ హననానికి పాల్పడుతుండడంతో జనసైనికులు తెగ బాధపడుతున్నారు. ఆ ముగ్గురి కుటుంబాలను కూడా తెరపైకి తెచ్చి జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ శైలిపై విశాఖలో ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఆయన విలాస జీవితంపై రకరకాల కథనాలున్నాయి. ఆయన తరచూ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటాడన్న టాక్ ఉంది.
Also Read: YCP Ministers: నాటి ఫైర్ ఏదీ?.. తేలిపోతున్న వైసీపీ మంత్రు ప్రెస్ మీట్లు

తరచూ శ్రీలంక సందర్శిస్తుంటారని కూడా అనుచరులు చెబుతుంటారు. గత ఎన్నికలు ముగిసిన తర్వాత శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు కూడా ఆయన శ్రీలంకలోనే ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఆయన అనేక మంది మహిళలతో సరదాగా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు జన సైనికుల చేతికి చిక్కాయి. తమ అధినేతపై వ్యాఖ్యలు చేశారన్న కోపంతో ఇప్పుడు అదే ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఓ ఫంక్షన్లో భార్యతో కలిసి చేసిన డాన్స్ వీడియోలను కూడా ట్యాగ్ చేస్తున్నారు. వాటిపై విమర్శల జడివాన రూపంలో కామెంట్లు చేస్తున్నారు. . దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబులను కూడా వదిలి పెట్టడం లేదు. వీరి ముగ్గురి ఫోటోలతో దారుణంగా ఫ్లెక్సీలు తయారు చేసి విశాఖలో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం జగన్ మాత్రం తాను అనుకున్నది సాధించారు. అటు పవన్, ఇటు కాపు మంత్రులు పరస్పరం వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంతో వచ్చిన మంటను జగన్ కాగుతున్నారు.
Also Read:Elon Musk: ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్.. ఇకనైనా ‘వాక్ స్వాతంత్య్రం’ వచ్చేనా?
Recommended Videos
[…] KTR – Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దీనిపై రాజకీయ కామెంట్లు రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ ఎక్కడ కూడా రాజకీయాల్లో తలదూర్చకపోయినా ఆయన పేరును ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుకుంటున్నారు. ఫలితంగా ఆదిపురుష్ కు రాజకీయ రంగు పులుముతున్నారు. దీంతో ప్రేక్షకులు బాధ పడుతున్నారు. […]
[…] […]
[…] Somu Veerraju: ఏపీలో బీజేపీ బలోపేతంపై సోము వీర్రాజు ద్రుష్టిపెట్టారా? బూత్ స్థాయి నుంచి పటిష్టపరచడానికి నిర్ణయించారా? ప్రతీ అయిదు బూత్ కమిటీలను శక్తి కేంద్రాలుగా మార్చనున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీలో హేమాహేమీ నాయకులు ఉన్నారు. ప్రతీ జిల్లాలో బలమైన కేడర్ సైతం ఉంది. అయితే తెలంగాణాతో పోల్చితే ఏపీలో పార్టీ బలీయమైన శక్తిగా ఎదగడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఒక విధంగా చెప్పాలంటే సోము వీర్రాజు గట్టి పోరాటమే చేస్తున్నారు. […]