Acharya Chiranjeevi Ram Charan Remuneration: భీమ్లా నాయక్ ,#RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సెన్సషనల్ హిట్స్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళలాడిపోతుంది..ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది..ఎందుకంటే ఈ సినిమాలో చిరంజీవితో గారితో పాటుగా ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా నటించడం..వీళ్లిద్దరి కాంబినేషన్ ని టాలీవుడ్ లో అపజయం అనేదే ఎరుగని కొరటాల శివ వంటి దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో ఈ మూవీ పై అభిమానుల్లో ఎంతతి భారీ అంచనాలు ఉన్నాయో ట్రేడ్ లో కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి..ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చిన్నగా ఒక్కో ప్రాంతం లో విడుదల ఓపెన్ చేస్తున్నారు..ఈనెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారాయి..అవేంటో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి చిరంజీవి మరియు రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం పై గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి..అయితే ఈ వార్తలపై ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి స్పందిస్తూ..చిరంజీవి మరియు రామ్ చరణ్ ఒక్క రూపాయి కూడా ఈ సినిమాలో పని చేసినందుకు తీసుకోలేదు అని..సినిమా విడుదల అయినా తర్వాత లాభాలు వస్తే అప్పుడు పంచుకుందాం అని చెప్పారు అని ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి తెలిపాడు..వాస్తవానికి రామ్ చరణ్ #RRR కి ముందు వరుకు కూడా ఒక్కో సినిమాకి 30 నుండి 35 కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు..#RRR సినిమాకి మూడేళ్ళ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు గాను ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి చెరో 45 కోట్ల రూపాయిల పారితోషికం ఇచ్చాడు ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య.
రామ్ చరణ్ మరియు చిరంజీవి ఆచార్య సినిమా ప్రారంభం లోనే రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని నిర్మాతని డిమాండ్ చేసి ఉంటె కచ్చితంగా నిర్మాత ఇద్దరికి కలిపి 80 కోట్ల రూపాయిలు ఇవ్వాల్సి వచ్చేది..కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ వల్ల చిత్రం విడుదల వాయిదా పడుతూ ఎన్ని రోజులు అభిమానులు వేచి చూడాల్సి వచ్చిందో మన అందరికి తెలిసిందే..హీరోలిద్దరు ముందుగా రెమ్యూనరేషన్ తీసుకొని ఉంది ఉంటె కచ్చితంగా నిర్మాతకి వడ్డీల రూపం లో దారుణమైన నష్టాలు వచ్చేవి..కానీ అలా చెయ్యకుండా నిర్మాత బాగోగులు ఆలోచించి రామ్ చరణ్ మరియు చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయానికి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తుంది..భారీ అంచనాల నడుమ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా వారి అంచనాలను ఎంత మాత్రం అందుకుంటుందో చూడాలి.
Recommended Videos: