Review On ACB Cases: ఏపీ సీఎం జగన్ ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. గత మూడున్నరేళ్లుగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. విపక్షాలు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. తాను అనుకున్నదే తడువు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుంటారు. వెంటనే జీవోలు, ఉత్తర్వులు జారీచేస్తారు. కోర్టులు మొట్టికాయలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలేవీ సవ్యంగా అమలుకాలేదు. తిరిగి వెనక్కి తీసుకున్నవే అధికం. మంత్రులతో సంప్రదించారు. తన చుట్టూ ఉండే ఐఏఎస్ లుతో ఆలోచన చేయరు. లక్షల జీతాలు తీసుకునే సలహాదారుల సలహాలు పాటించరు. తాను నమ్మిన ఆ ముగ్గరు, నలుగురు విధేయులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అదే ఫైనల్ అంటారు. తాను చెప్పిందే వేదం అంటారు. అయితే ఇలా తీసుకున్న డెసిషన్స్ ఏవీ నిలబడిన దాఖలాలు లేవు. తాజాగా ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారులు, ఉద్యోగుల ఏసీబీ కేసులను పున పరిశీలనకు ఒక హైపర్ కమిటీ ఏర్పాటు చేశారు.
సాధారణంగా ఏసీబీ కేసులు రెండు రకాలుగా నమోదవుతాయి. అధికారులు, ఉద్యోగులు నేరుగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా కేసులు నమోదుచేస్తారు. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు కూడాబెట్టారని తెలిసినా, ఫిర్యాదులు వచ్చినా ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీ చేసి కేసులు నమోదుచేస్తారు. అయితే ఇందులో ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి కేసులను మాత్రమే హైపవర్ కమిటీ పరిశీలించనుంది. 2014 lనుంచి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్లో చాలావరకూ కక్షపూరిత ధోరణితో నమోదుచేసినవేనని సీఎం జగన్ భావిస్తున్నారు. అప్పట్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ అక్రమ కేసులు నమోదు అయ్యాయని చెబుతున్నారు. వారందరికీ విముక్తి కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: YSR Kalyanamasthu and Shadi Thofa: 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా.. ఆ అర్హతలుంటేనే సాయమట
హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, పరిశ్రమల శాఖ చీఫ్ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, పబ్లిక్ సర్వీసెస్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన ఏసీబీ కేసులను క్షుణ్ణంగా పరిశీలించనుంది. కేసులు నమోదైన తీరు,ఫిర్యాదులు, పట్టుబడిన నగదు, సొత్తు గురించి ఆరా తీసి నిజ నిర్థారణ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏసీబీనీ దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏసీబీ కేసుల పున పరిశీలనకు హైపవర్ కమిటీని ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
మరోవైపు ఏసీబీ కేసుల్లో ఉన్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అవినీతి అధికారులకు ప్రభుత్వం వంత పడుతోందని.. దానికి రాజకీయరంగు పులుముతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘాల విన్నపం మేరకు తాము స్పందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అటువంటప్పుడు వేతన బకాయిలు, పీఆర్సీ, చివరకు సీపీఎస్ రద్దు వంటి అంశాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే తాజాగా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది.
Also Read: 1200 Year Old Ship: 1200 సంవత్సరాల క్రితం నాటి ఓడ దొరికింది: ఇది విప్పే రహస్యాలు ఏంటో తెలుసా