AP Govt vs Bheemla Nayak: ‘భీమ్లానాయక్’ సినిమాని అడ్డుకుందామని ఏపీ ప్రభుత్వం చేసే ప్రయత్నమే ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసిందా?

AP Govt vs Bheemla Nayak: నీతిగా.. నిజాయితీగా ఉంటే అడ్డంకులు కూడా మనకు సోపానంగా మారుతాయి.. ఏపీ సర్కార్ ఇప్పుడు రాళ్లేసినా పవన్ కళ్యాణ్ పై పూలు లాగే పడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ‘భీమ్లానాయక్’ను తొక్కేద్దామని సంకల్పించిన జగన్ సర్కార్ ఆశలకు గండికొడుతూ అంతకుమించిన స్పందనతో సినిమాపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఏపీలో తన ప్రత్యర్థి అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమాను జగన్ సర్కార్ అణిచివేసిందన్న టాక్ బాగా సాగింది. అదే ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : February 25, 2022 11:45 am
Follow us on

AP Govt vs Bheemla Nayak: నీతిగా.. నిజాయితీగా ఉంటే అడ్డంకులు కూడా మనకు సోపానంగా మారుతాయి.. ఏపీ సర్కార్ ఇప్పుడు రాళ్లేసినా పవన్ కళ్యాణ్ పై పూలు లాగే పడ్డాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ‘భీమ్లానాయక్’ను తొక్కేద్దామని సంకల్పించిన జగన్ సర్కార్ ఆశలకు గండికొడుతూ అంతకుమించిన స్పందనతో సినిమాపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఏపీలో తన ప్రత్యర్థి అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమాను జగన్ సర్కార్ అణిచివేసిందన్న టాక్ బాగా సాగింది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు హైప్ క్రియేట్ అవ్వడానికి జగన్ వైఖరి కూడా కారణమంటున్నారు.

AP Govt vs Bheemla Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ మూవీ ఈరోజు విడుదలైంది. తెలంగాణలో 5వ షోకు అనుమతి, బెనిఫిట్, ప్రీషోలు, టికెట్ రేట్లు పెంచి కేసీఆర్ సర్కార్ సహకరించింది. అయితే ఏపీలో మాత్రం జగన్ సర్కార్ టికెట్ రేట్లు పెంచకుండా తొక్కేసింది.సినిమాపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ లో ఆవేశం, ఆక్రందన తన్నుకొచ్చింది. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఏపీలో ‘భీమ్లానాయక్’ మూవీపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అదనపు షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరించింది. జీవో నం.35ను స్టిక్ట్ గా అమలు చేసింది. లేకుంటే థియేటర్లు సీజ్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ తన సినిమాను ఎంతగా ఏపీలో తొక్కేద్దామనుకుంటున్నా జగన్ ను శరణు వేడకుండా అంతే ధీటుగా ప్రతిస్పందించారు. టాలీవుడ్ పెద్దలలాగా తాను వంగి దండాలు పెట్టనని.. డబ్బుల కోసం కక్కుర్తి పడే మనిషిని కాదని సవాల్ చేశారు.

ఇక భీమ్లానాయక్ రిలీజ్ వేళ పవన్ చేసిన ట్వీట్ కూడా సినీ ఇండస్ట్రీ మౌనాన్ని.. జగన్ సర్కార్ ఆధిపత్యపు ధోరణిని గట్టిగా ప్రశ్నించింది. దీంతో జనాల్లోనూ దీనిపై తీవ్రమైన చర్చ సాగింది. జగన్ సర్కార్ ఎందుకు ‘భీమ్లానాయక్’ను తొక్కేద్దామనుకుంటుందని.. అందులో ఏముందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పడింది.

Also Read: Bheemla Nayak Tickets Controversy: ఆ ప్రాంతంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ‌.. రానా ఫ్యాన్స్ ఆందోళ‌న‌

భీమ్లానాయక్ మూవీలో జగన్ జైలు జీవితం గురించి.. ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే దానిపై విమర్శనాత్మకంగా చూపించారన్న టాక్ బయటకు రావడంతో సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి కనబరిచారు. అది సినిమాకు ప్రేక్షకాదరణ రావడానికి కారణమైంది.

ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు ‘భీమ్లానాయక్’ మూవీపై ఏపీ సర్కార్ ఎంత తొక్కేయాలనుకుంటే.. అంతగా ఆ మూవీకి జనాల్లో పబ్లిసిటీ వచ్చి.. ఆసక్తి ఏర్పడి రికార్డు కలెక్షన్లకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది. జగన్ చెడు చేసినా పవన్ కు మంచే జరిగిందనడానికి ఇదే ఉదాహరణగా చెప్పొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Bheemla Nayak vs Akhanda Pushpa Collections: అఖండ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

Recommended Video: