Jagan Sarkar: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అప్పుల (Debts) ఊబిలో ఇరుక్కుపోతోంది. వేల కోట్టు అప్పులు చేస్తూ సంక్షేమ పథకాల అమలుతో ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా రూ.7 వేల కోట్లఅప్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వేల కోట్లు సంక్షేమ పథకాల్లో పెడుతూ అప్పుల భారం పెంచుకుంటున్నారు. దీంతో ప్రతిపక్షాలు సైతం గొంంతు విప్పుతున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ర్టం అప్పుల భారంలో మునిగిపోతోంది. రోజురోజుకు ప్రభుత్వ నిర్వహణ కష్టంగానే మారుతోంది.
గత సంవత్సరం సుమారు సైతం లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే అప్పుల భారం మోయకతప్పదు. సంక్షేమ పథకాలన్ని ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. ప్రజల ఖాతాల్లోకి వెళుతున్నాయి. అభివృద్ధి మాట మర్చిపోయి సంక్షేమ పథకాలే పెట్టుబడిగా భావించి ముందుకు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై ఇప్పటికే ఆక్షేపణలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు మరో ఏడు వేల కోట్లు అప్పుగా తేవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు చేరేందుకు అప్పులు తీసుకొస్తూ అందరిని సంతృప్తి పరిచే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో బాగంగానే కమ్మ, రెడ్డి, క్షత్రియ వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా వారికే నగదు అందేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
మరోపక్క కేంద్ర ప్రభుత్వం స్టేట్లు చేస్తున్న అప్పులపై దృష్టి సారించింది. ఏపీ అప్పుల భారంతోనే కుదేలైపోతోంది. ఇప్పటికే వేల కోట్లు అప్పుగా తెచ్చి మరో రెండేళ్లు ఉండడంతో ప్రభుత్వాన్ని నడపడం కష్టంగానే ఉందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం సజావుగా సాగేందుకు ఇంధనంలా పనిచేయాలంటే డబ్బే ప్రధానం కావడంతో దాని కోసం వెంపర్లాడడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి డబ్బు అవసరం ఎక్కువగా ఉందనే విషయం తెలుస్తోంది.