తగ్గేదే లే.. విశాఖ నుంచే జగన్.. ముహూర్తం ఖరారు

మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నుంచే పాలన ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా ముందుంచినట్లు తెలుస్తోంది. న్యాయచిక్కులు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై కోర్టులో అనేక కేసులు పెండింగులో ఉన్నాయి. కోర్టు అనుమతి లేకుండా కార్యాలయాలు తరలిస్తే ఎదురయ్యే పరిణామాలపై అధికారులు భయపడుతున్నారు. దీంతో ముందుగా విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 3:56 pm
Follow us on

మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నుంచే పాలన ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా ముందుంచినట్లు తెలుస్తోంది. న్యాయచిక్కులు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై కోర్టులో అనేక కేసులు పెండింగులో ఉన్నాయి. కోర్టు అనుమతి లేకుండా కార్యాలయాలు తరలిస్తే ఎదురయ్యే పరిణామాలపై అధికారులు భయపడుతున్నారు. దీంతో ముందుగా విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు జులై 28న ముహూర్తంగా నిర్ణయించారు. ఆషాఢ మాసం కావడంతో మంచిది కాదని ఆగస్టు 15న వెళ్లాలని భావిస్తున్నారు. అదే రోజు జాతీయ పండుగ కావడంతో పాలనా వ్యవహారాలు అక్కడ నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశాలు, పాలనాపరమైన నిర్ణయాలు అక్కడి నుంచే చేపట్టనున్నట్లు సమాచారం. అదే సమయంలో కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు రాష్ర్టప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

విశాఖలో పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తసుకుంటున్నారు. రోడ్ల విస్తరణ, విశాఖ డెవలప్ మెంట్, మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అక్కడే ఉంటూ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. విశాఖలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వాటిలో 110 ఎకరాలను మినహాయించి మిగిలిన వాటికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు.

విశాఖ నుంచి పాలన ప్రారంభానికి ప్రధాని, హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించినట్లు సమాచారం. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైతే రాజకీయంగా వారికి సమాధానం చెప్పినట్లు అవుతుంది. కోర్టు కేసులు పెండింగులో ఉండగా ప్రభుత్వం తొందరపడటం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూడు రాజధానుల వ్యవహారంలో వేగంగా అడుగులు వేయడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడిందని వైసీపీ అంచనా.